- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Book Fair 2025: పుస్తకం చదివినప్పుడు కలిగిన అనుభూతి ఏం చేసినా రాదు
Book Fair 2025: పుస్తకం చదివినప్పుడు కలిగిన అనుభూతి ఏం చేసినా రాదు

దిశ, వెబ్‌డెస్క్: పుస్తక ప్రియులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హైదరాబాద్ బుక్ ఫెయిర్-2025 ప్రారంభం అయింది. మంత్రి జూపల్లి కృష్ణారావు శుక్రవారం హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. డిజిటల్, సోషల్ మీడియా ఎంత పెరిగినా పుస్తకాలు చదివే విధానాన్ని ఇప్పటికీ అనేకమంది కొనసాగిస్తున్నారని అన్నారు. ఆనాటి విలువలు.. ఆనాటి సంస్కారం.. ఆనాటి గుణగణాలు.. చాలా మంది కొనసాగిస్తున్నారని అభినందించారు. పుస్తకాలు, గొప్ప వాళ్ళ పుస్తకాలు చదివితేనే స్ఫూర్తి పొందుతామన్నారు. తద్వారా ఆలోచన విధానం కూడా మారుతుందన్నారు. ఎడ్యుకేషన్ అంటే పుస్తకాలు చదవడం బట్టి కొట్టడం, ర్యాంకులో మార్కుల కోసం మాత్రమే కాదన్నారు. చరిత్ర తెలుసుకోవడం కూడా ముఖ్యమే అన్నారు. గ్రామాలలో ప్రతి ఇల్లు ఒక లైబ్రరీగా మారాలన్నారు. ఒక ఫుల్ బాటిల్‌కు పెట్టే ఖర్చుతో రెండు మూడు బుక్స్ కొనుక్కోవచ్చని చెప్పారు. అనంతరం ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. పరిపూర్ణ జ్ఞానాన్ని పొందడం పుస్తక పఠనం ద్వారానే సాధ్యమవుతుందన్నారు. పుస్తకం చదవటం అంటేనే ఒక చరిత్రలోకి ప్రయాణం చేయడమని తెలిపారు. అనేకమంది పెద్ద మనుషులతో ప్రత్యక్షంగా సంభాషించడానికి పుస్తకం అవకాశం కల్పిస్తుందన్నారు. ఒక గొప్ప జీవితం, ఒక మంచి పుస్తకం చదివినప్పుడు కలిగిన అనుభూతిని కొందనే ఆస్వాదిస్తారని అన్నారు. అది చాలా గొప్పగా ఉంటుందని తెలిపారు. ఈసారి ఈ ప్రాంగణానికి అందెశ్రీ పేరు పెట్టడం సంతోషదాయకంమన్నారు.






