ప్రముఖ ఐటీ కంపెనీలో బోనాల సెలబ్రేషన్స్..నెట్టింట వైరల్

by Ajay Maddhiboyina |

ఆషాడం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో బోనాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

ప్రముఖ ఐటీ కంపెనీలో బోనాల సెలబ్రేషన్స్..నెట్టింట వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ఆషాడం వచ్చిందంటే చాలు తెలంగాణలో బోనాల సందడి మొదలవుతుంది. ముఖ్యంగా హైదరాబాద్‌లో బోనాల పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పోతురాజుల ఆటలు డప్పు చప్పుల నడుమ బోనం ఎత్తుతారు. అయితే ఉద్యోగాల్లో బిజీగా ఉండేవాళ్లు మాత్రం ఈ వేడుకలను మిస్ అవుతూ ఉంటారు. కానీ అలాంటి బాధ లేకుండా ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ తమ కంపెనీలో బోనాల సెలబ్రేషన్స్ జరిపింది. దీనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియోలో పోతురాజు స్టెప్పులు వేస్తుండగా మరో ఇద్దరు ఉద్యోగులు డప్పులు కొడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ట్విట్టర్ లో ఈ వీడియోకు 24 గంటల్లో 5 లక్షల వ్యూవ్స్ వచ్చాయి. అంతే కాకుండా 17వేల మంది లైక్ చేశారు. కాగా వీడియోపై భిన్నాబిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పని సమయంలో అప్పుడప్పుడూ ఇలాంటివి ఉంటే ఉత్సాహం డబుల్ అవుతుందని కొందరు కామెంట్ చేస్తే, మరికొందరు పని సమయంలో ఇలాంటివి చేయడం నాన్ సెన్స్ అంటూ కామెంట్ చేస్తున్నారు. వీడియో

Next Story