- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌కి వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బాంబు బెదిరింపు కలకలం
దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం (EK-526)కి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలకం రేపింది.

దిశ, డైనమిక్ బ్యూరో: దుబాయ్ నుంచి హైదరాబాద్‌కి బయలుదేరిన ఎమిరేట్స్ విమానం (EK-526)కి బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో శుక్రవారం రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక్కసారిగా కలకలకం రేపింది. ఉదయం 7:30 గంటల సమయంలో హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్ కస్టమర్ సపోర్ట్ మెయిల్‌కు బాంబుతో విమానాన్ని పేల్చేస్తామంటూ బెదిరింపు సందేశం అందడంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా ఉన్న నేపథ్యంలో విమానం ఎలాంటి అవాంతరాలు లేకుండా ఉదయం 8:30 గంటలకు ఆర్జీఐఏలో సురక్షితంగా ల్యాండ్ అయింది. ల్యాండింగ్ అనంతరం విమానాన్ని ఒంటరికి తరలించి, ప్రయాణికులను జాగ్రత్తగా దింపి, బాంబ్ డిస్‌పోజల్ స్క్వాడ్ సహా వివిధ భద్రతా బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీలు చేశాయి. అయితే ఎలాంటి పేలుడు పదార్థాలు లభించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఎమిరేట్స్ బెదిరింపు ఈ-మెయిల్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరు పంపారు? అన్న దానిపై సైబర్ పోలీసులతో కలిసి అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇటీవలి కాలంలో హైదరాబాద్ వైపు వచ్చే విమానాలకు వరుసగా బాంబు బెదిరింపులు రావడం ఆందోళన కలిగిస్తోంది. గురువారం మెడినా-హైదరాబాద్ ఇండిగో విమానం (6E 058)కు వచ్చిన బెదిరింపు కారణంగా అది అహ్మదాబాద్‌లో అత్యవసర ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. ఇదే వారంలో మరో కువైట్-హైదరాబాద్ ఇండిగో విమానం బాంబు బెదిరింపుతో ముంబైకి మళ్లించారు.
నవంబర్ 22న ఆర్‌డీఎక్స్ ఉంచారంటూ వచ్చిన ఒక బెదిరింపు వచ్చింది. నవంబర్ 1న ఇండిగో 6E 68 విమానాన్ని హైదరాబాద్‌లో ల్యాండ్ కాకుండా అడ్డుకోవాలంటూ ఒక ఈ-మెయిల్ రావడంతో విమానాన్ని దారీ మళ్లించారు. ఆ రోజు ఉదయం 5:25 గంటలకు వచ్చిన ఈ మెయిల్‌ను బాంబ్ థ్రెట్ అసెస్మెంట్ కమిటీ (BTAC) పరిశీలించి ప్రత్యేక బెదిరింపుగా ప్రకటించింది.






