తెలంగాణలో గడ్డి మందుపై నిషేధం అవసరం

by Gantepaka Srikanth |   (  Updated:2026-02-21 17:02:06  IST  )

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ బహిరంగ లేఖ రాశారు.

తెలంగాణలో గడ్డి మందుపై నిషేధం అవసరం
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్(Boinapalli Vinod Kumar) బహిరంగ లేఖ రాశారు. ‘రాష్ట్రంలో క్షణికావేశంలో గడ్డిమందు తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచంలో 70 దేశాలు ఈ గడ్డి మందును నిషేధించాయి. తెలంగాణలో కూడా గడ్డిమందు నిషేధంపై ఆలోచన చేయాలి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఆత్మహత్యలకు పాల్పడిన మెజార్టీ రైతుల్లో.. గడ్డిమందును వాడిన వారే ఎక్కువగా ఉన్నారు. రైతులు, సామాన్యుల ప్రాణాలను రక్షించే క్రమంలో ఈ అంశంపై తక్షణమే స్పందించి నిర్ణయం తీసుకోవాలి. తెలంగాణలోని అనేక ప్రాంతాల నుంచి, రైతుల నుంచి సేషేధం విధించాలనే డిమాండ్ ఉంది’ అని ఈ సందర్భంగా వినోద్ కుమార్ గుర్తుచేశారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణ వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సీఎస్ రామకృష్ణారావు, రైతు కమిషన్ చైర్మన్ కోదండరామ్ రెడ్డి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ చైర్మన్ డాక్టర్ కిషన్‌కు లేఖ రాశారని వినోద్ కుమార్ వివరించారు.

Next Story