- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భవిష్యత్ హైదరాబాద్‌కు బ్లూప్రింట్.. క్యూర్, హెచ్-సిటీ ప్రాజెక్టులకు భారీ కేటాయింపులు
ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల అభివృద్ధి నేపథ్యంలో భవిష్యత్ హైదరాబాద్‌కు ఓ బ్లూప్రింట్ సిద్దం చేసి.. నిధులు కేటాయించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) లోపల కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) ప్రాంతంలో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు, పరిశోధన, అభివృద్ధి స్టార్టప్, ఫైనాన్షియల్ సర్వీస్ సంస్థలు, ఇతర సర్వీస్ సెక్టార్‌లను అధిక విలువైన సేవల కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో పట్టణ జనాభా 2031 నాటికి 53.8 శాతానికి చేరుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో క్యూర్ ప్రాంత పరిధిని కాలుష్య రహితంగా (నెట్ జీరో) మార్చేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
హెచ్-సిటీ ప్రాజెక్టులకు రూ.2,654 కోట్లు
క్యూర్ పరిధిలోని జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ కార్పొరేషన్ల పరిధిలో ఫ్లైఓవర్లు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల ప్రాజెక్టులు చేపట్టడానికి ప్రభుత్వం రూ.2,654 కోట్లు కేటాయించింది. ట్రాఫిక్ రద్దీ నియంత్రణకు హెచ్-సిటీలో రూ.7032 కోట్లతో 31 ఫ్లైఓవర్లు, 17 అండర్ పాసులు, 10 రోడ్లను విస్తరించాలని ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అందులో భాగంగానే 2024-25 బడ్జెట్‌లో రూ.2,654 కోట్లు, 2025-26 బడ్జెట్‌లో రూ.2,654 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ బడ్జెట్‌లోనూ రూ.2,654 కోట్లు కేటాయించింది.
కామన్ ఆర్గనైజేషన్
మూడు మున్సిపల్ కార్పొరేషన్లతో పాటు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సంస్థ, హైడ్రా వంటి సంస్థల అన్నింటినీ సమన్వయం చేసేందుకు ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి తగిన చట్ట సవరణ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాత జీహెచ్ఎంసీ సంస్థకు ఉన్న అధిక వడ్డీ అప్పుల గురించి సంబంధిత బ్యాంకులతో చర్చించి, వడ్డీ రేటును 9.15 శాతం నుంచి 7.95 శాతానికి తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది. దీంతో సంస్థకు ఎంతో ఉపశమనం లభించింది.
స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్
క్యూర్ కోసం స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ప్రభుత్వం కేటాయించింది. ఎస్సీ స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్స్ ద్వారా రూ.315 కోట్లు కేటాయించింది. దీంతోపాటు క్యూర్ పరిధిలోని పెట్రోల్, డీజిల్ ఆటోలను రెట్రో ఫిట్టింగ్ ద్వారా ఎలక్ట్రిక్ వాహనాలుగా ప్రభుత్వ ఖర్చుతో మార్చాలని నిర్ణయించింది. దీని కోసం రూ.200 కోట్లు కేటాయించింది. వృత్తి పన్ను పరిహారం కింద రూ.10 కోట్లు కేటాయించింది. మోటారు వెహికల్ టాక్స్ పరిహారం కింద రూ.10 లక్షలను కేటాయించింది.
ఏడాది ప్రతిపాదనలు కేటాయింపులు
2024-25 రూ.5వేల కోట్లు రూ.3065 కోట్లు
2025-26 రూ.7వేల కోట్లు రూ.3,101కోట్లు
2026-27 రూ.10వేల కోట్లు రూ.3,179కోట్లు






