Hyderabad Alert: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బ్లాస్ట్.. హైదరాబాద్ CP సజ్జనార్ సంచలన ప్రకటన

by Ramesh Naini |

దేశ రాజధాని ఢిల్లీలో ఇవాళ ఎర్రకోట మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ వద్ద కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

Hyderabad Alert: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బ్లాస్ట్.. హైదరాబాద్ CP సజ్జనార్ సంచలన ప్రకటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: (Massive explosion in Delhi) దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో ఇవాళ (సోమవారం) ఎర్రకోట మెట్రోస్టేషన్‌ పార్కింగ్‌ వద్ద కారులో భారీ పేలుడు సంభవించిన విషయం తెలిసిందే. ఈ పేలుడు కారణంగా తొమ్మిది మంది మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 20 మందికి పైగా తీవ్ర గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేంద్రం దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ పోలీసులు అప్రమత్తమయ్యారు.

హైదరాబాద్ పాతబస్తీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. రద్దీ ప్రాంతాల్లో వాహన తనిఖీలు చేపట్టినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం వెంటనే ఇవ్వాలని సీపీ సజ్జనార్ సంచలన ప్రకటన చేశారు.

Next Story