- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘లోకల్’ పోరుపై బీజేపీ వర్కవుట్ షురూ.. దక్షిణ తెలంగాణపై స్పెషల్ ఫోకస్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది.

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో తన సత్తా చాటేందుకు బీజేపీ కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. మెజార్టీ సంఖ్యలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రతి జిల్లా నాయకులతో వర్క్‌షాపులు, సమావేశాలు నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. తెలంగాణలో ఇప్పటి వరకు ఒక్క జెడ్పీ చైర్మన్సీటు సైతం దక్కించుకోని కమలం పార్టీ ఈ సారి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్నగర్జెడ్పీ స్థానాల్లో గెలిచి తీరాలని కంకణం కట్టుకున్నట్టు తెలుస్తున్నది.
పార్టీ బలోపేతానికి ఇదే అవకాశంగా..
గ్రామీణ స్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు ఇదే అవకాశంగా భావించిన బీజేపీ ఇందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు టాక్వినిపిస్తోంది. గ్రామాల్లో పార్టీ కార్యకలాపాలు పర్యవేక్షించడంతో పాటు కేంద్రం అమలు చేస్తోన్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతలను సైతం నిర్వర్తించనున్నారు. ప్రధానంగా జీఎస్టీ తగ్గింపుతో పాటు ఆయుష్మాన్ భారత్, కిసాన్ సమ్మాన్ నిధి పథకం, నిత్యావసర ధరల తగ్గుదల వంటివి ప్రజలకు వివరించి ఏ మేరకు లబ్ధి చేకూరిందో తెలుసుకునేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.
ఉత్తర తెలంగాణలో పట్టు కోసం యత్నం
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో బీజేపీకి బలమైన పట్టుంది. గత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏడుగురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీలు, రెండు ఎమ్మెల్సీల స్థానాలను కమలం పార్టీ తన ఖాతాలో వేసుకుంది. స్థానిక ఎన్నికల్లో ఆయా జిల్లాల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని హైకమాండ్రాష్ట్ర నేతలకు ఆదేశించినట్లు తెలిసింది. ఎంపీ, ఎమ్మెల్యేలున్న చోట గెలవకుంటే వారి పని తీరు బాగాలేదనే సంకేతాలు హైకమాండ్‌కు వెళ్లక తప్పదని, ఇప్పడు గెలిచిన వారికి సొంత బలం లేదని, మోడీ హవాతోనే వారు గెలిచారనే భావన సైతం ప్రజల్లో కలుగుతుందని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
మార్క్ కోసం పార్టీ చీఫ్ కొత్త ఎత్తుగడలు
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మార్క్చూపించేందుకు పార్టీ చీఫ్ రామచందర్రావుకొత్త పంథా అనుసరిస్తున్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇటీవల జరిగిన పదాధికారులు సమావేశంలో నేతలంతా గ్రేటర్హైదరాబాద్వదిలి పల్లె బాట పట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. జిల్లాల్లోనూ వర్క్‌షాప్‌లు నిర్వహించి కార్యకర్తలకు, ముఖ్య నేతలకు ఎన్నికల వ్యూహరచనపై దిశానిర్దేశం చేయనున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగా రామచందర్‌రావు త్వరలో జిల్లా్ల్లో పర్యటించనున్నారు.






