- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Aadi srinivas: కాళేశ్వరం అవినీతిలో కేసీఆర్ ఫ్యామిలీని బీజేపీ కాపాడే ప్రయత్నం: ఆది శ్రీనివాస్
తన పాత బాస్ రుణం తీర్చుకోవడం కోసమే ఈటల కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాట మారుస్తున్నారా అని ఆదిశ్రీనివాస్ ప్రశ్నించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ కు పట్టిన గతే కేసీఆర్ కు పడుతుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. కాళేశ్వరం అవినీతి నుంచి కేసీఆర్ కుటుంబాన్ని బయటపడేసే ప్రయత్నం బీజేపీ చేస్తోందని ఆరోపించారు. కాళేశ్వరం నిర్మాణం అంతా కేసీఆర్ ఇష్టానుసారమే జరిగిందని, కేసీఆర్ రాజీనామా చేయాలని గతంలో ఆరోపించిన ఈటల రాజేందర్ ఇప్పుడు మేడిగడ్డ నిర్మాణం మంత్రివర్గం నిర్ణయం ప్రకారమే జరగిందని ఎందుకు అంటున్నారని ప్రశ్నించారు. ఇవాళ హైదరాబాద్ లో సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆది శ్రీనివాస్.. బీజేపీ నేతలు గతంలో చేసిన వ్యాఖ్యలకు విరుద్ధంగా ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారింది ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా తో సహా పలువురు కేంద్ర మంత్రులు ఎన్నో సార్లు మాట్లాడారు. మోడీ, అమిత్ షా వ్యాఖ్యలను ఈటల రాజేందర్ (Eatala Rajender) వ్యతిరేకిస్తున్నారు? తన పాత బాస్ రుణం తీర్చుకునేందుకు ఇలా మాట్లాడుతున్నారా ఈటల చెప్పాలన్నారు. గతంలో కాళేశ్వరంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేసిన బీజేపీ (BJP) విచారణ కీలక దశలో ఉన్నప్పుడు ఎందుకు యూ టర్న్ తీసుకుంటున్నారని నిలదీశారు. ఈ రెండు పార్టీల బంధం బలోపేతానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్సీ కవిత చెప్పినట్లు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం జరగబోతున్నదా? అని ప్రశ్నించారు.
ఈ రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ ను దొంగ దెబ్బతీసే కుట్ర చేశాయని మేము ఎన్నో సార్లు చెప్పామన్నారు. బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ ఎందుకు సమర్థిస్తున్నదో అర్థం చేసుకోవాలన్నారు. అవినీతిపరులు బీజేపీలోకి వెళ్లగానే నీతిమంతులుగా మారిపోతున్నారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం లేకపోతే తెలంగాణ లేదు అన్నట్లుగా బీఆర్ఎస్ మాట్లాడుతోందని ఇక్కడ గతంలోనూ ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. డీపీఆర్ కు విరుద్ధంగా మేడిగడ్డ ప్రాజెక్టును 5 కిలోమీటర్ల దూరం ఎందుకు మార్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం అంచనాను రూ. 30 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్లకు ఎందుకు పెంచారని నిలదీశారు. నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ వీటిని నెరవేర్చడంలో విఫలం అయిందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో గల్ఫ్ బాధితులకు రూపాయి కూడా చెల్లించలేదని మేము అధికారంలోకి వచ్చాక గల్ఫ్ లో మరణించిన వారికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేసి ఆదుకుంటున్నామని చెప్పారు.






