రాజాసింగ్‌ హద్దులు దాటుతున్నాడు.. రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపిస్తున్నాం: బీజేపీ ప్రకటన

by Gantepaka Srikanth |

పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో కలకలం రేగింది.

రాజాసింగ్‌ హద్దులు దాటుతున్నాడు.. రాజీనామా లేఖను హైకమాండ్‌కు పంపిస్తున్నాం: బీజేపీ ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ప్రకటన వేళ తెలంగాణ బీజేపీ(Telangana BJP)లో కలకలం రేగింది. అనూహ్యంగా ఆ పార్టీ కీలక నేత, గోషామాల్ ఎమ్మెల్యే రాజాసింగ్(MLA Raja Singh) రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్ రెడ్డికి పంపించారు. అయితే.. రాజాసింగ్ వ్యవహారంపై తాజాగా రాష్ట్ర పార్టీ అధిష్టానం స్పందించింది. రాజాసింగ్‌ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని కొట్టిపారేసింది. రాజాసింగ్‌ క్రమశిక్షణా రాహిత్యం పరాకాష్టకు చేరిందని మండిపడింది. రాజాసింగ్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనుకుంటే స్పీకర్‌కు లేఖ ఇవ్వాలని హితవు పలికింది. బీజేపీ నాయకులు, వ్యక్తుల కంటే.. కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తుందని గుర్తుచేసింది. రాష్ట్ర పార్టీ అధ్యక్షులకు ఇచ్చిన రాజీనామా లేఖను జాతీయ అధ్యక్షుడికి పంపిస్తున్నామని బీజేపీ పేర్కొంది.

ఇదిలా ఉంటే.. రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక వ్యక్తిని అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరుగుతోందని, సరైన వ్యక్తికి బాధ్యతలు ఇవ్వకపోతే పార్టీ చాలా నష్టం జరుగుతుందని అన్నారు. నావాడు, నీవాడు అంటూ నియమించుకుంటూ పోకూడదని హితవు పలికారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలంటే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.

Next Story