- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
2028లో రాష్ట్రంలో బీజేపీదే అధికారం.. నేనే సీఎం అవుతా: ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సంచలన వ్యాఖ్యలు
2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, అప్పుడు నేనే సీఎం అవుతానంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.

X
దిశ, వెబ్‌డెస్క్: 2028లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతోందని, అప్పుడు నేనే సీఎం అవుతానంటూ కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన కామారెడ్డిలో మీడియాతో మాట్లాడుతూ.. నా జోలికొచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తప్పు మీద తప్పు చేస్తోందని వార్నింగ్ ఇచ్చారు. 50 ఏళ్ల కాంగ్రెస్, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వాసుపత్రుల్లో కనీస సౌకర్యాలు లేవని ధ్వజమెత్తారు. దోమకొండలో వంద పడకల ఆసుపత్రిని పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఇద్దరు సీఎంలపై గెలిచిన తనను ఆషామాషీగా తీసుకోవద్దని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి ఫైర్ అయ్యారు.
Next Story






