BJP Telangana: మరో నాలుగు జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన

by Gantepaka Srikanth |

స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ(BJP Telangana) అధిష్టానం దూకుడు ప్రదర్శిస్తోంది.

BJP Telangana: మరో నాలుగు జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల వేళ తెలంగాణ బీజేపీ(BJP Telangana) అధిష్టానం దూకుడు ప్రదర్శిస్తోంది. వీలైనంత మేర క్షేత్రస్థాయిలో పార్టీని పటిష్టం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమిస్తోంది. ఇటీవలే 19 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించగా.. తాజాగా మరో నాలుగు జిల్లాల అధ్యక్షుల జాబితాను విడుదల చేసింది. యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఊటుకూరు అశోక్ గౌడ్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా సి.గోదావరి, మహబూబాబాద్‌కు వల్లభు వెంకటేశ్వర్లు, గోల్కొండ-గోషామహాల్‌కు టి. ఉమామహేంద్రను అధ్యక్షుడిగా నియమిస్తూ రాష్ట్ర సహా ఎన్నికల అధికారి కే.గీతామూర్తి అధికారిక ప్రకటన విడుదల చేశారు.

ఇప్పటివరకు ప్రకటించిన జిల్లాల అధ్యక్షులు :

1. ఆదిలాబాద్ - పంతంగి బ్రహ్మానంద.

2. మంచిర్యాల - వెంకటేశ్వర్ గౌడ్

3. కొమరం బీం ఆసిఫాబాద్ - శ్రీశైలం ముదిరాజ్

4. నిజామాబాద్ - దినేశ్ కులాచారి

5. కామారెడ్డి - నీలం చిన్న రాజులు

6. జగిత్యాల రాచకొండ - యాదగిరి బాబు

7. పెద్దపల్లి - కర్రె సంజీవ్ రెడ్డి

8. మెదక్ - వల్దాస్ రాధామల్లేశ్ గౌడ్

9. మేడ్చల్ మల్కాజిగిరి రూరల్ - బుద్ది శ్రీనివాస్

10. నల్గొండ - నాగం వర్షిత్ రెడ్డి

11. మహబూబ్ నగర్ - పి.శ్రీనివాస్ రెడ్డి

12. వనపర్తి - దుప్పల్లి నారాయణ

13. హన్మకొండ - కొలను సంతోశ్ రెడ్డి

14. వరంగల్ -గంట రవి కుమార్

15. జయశంకర్ భూపాలపల్లి - నిశిధర్ రెడ్డి

16. జనగామ - సౌడ రమేశ్

17. ములుగు - సిరికొండ బలరాం

18. మహంకాళి సికింద్రాబాద్ - గుండగోని భరత్ గౌడ్

19. హైదరాబాద్ సెంట్రల్ - లంకాల దీపక్ రెడ్డి

20. యాదాద్రి భువనగిరి - ఊటుకూరు అశోక్ గౌడ్

21. గోల్కొండ-గోషామహాల్‌- టి. ఉమామహేంద్ర

22. మహబూబాబాద్‌ - వల్లభు వెంకటేశ్వర్లు

23. సంగారెడ్డి - సి.గోదావరి

Next Story