‘ఆయుధాలు వదిలేయడానికి మావోయిస్టులు అంగీకారం’.. బీజేపీ నేత సంచలన ప్రకటన

by Gantepaka Srikanth |

మావోయిస్టు పార్టీ సీజ్ ఫైర్‌కు అంగీకారం తెలిపిందని బీజేపీ నేతల ప్రకటన.

‘ఆయుధాలు వదిలేయడానికి మావోయిస్టులు అంగీకారం’.. బీజేపీ నేత సంచలన ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: మావోయిస్టు పార్టీ(Maoist Party) సంచలన ప్రకటన చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. నెల రోజుల పాటు ఆయుధాలు వదిలేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit Shah)కు లేఖ రాసినట్లు బీజేపీ నేతలు నెట్టింట విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్(Maoist Leader Abhay) పేరిట అమిత్ షాకు లేఖ వచ్చిందని పేర్కొంటున్నారు. కాల్పులు వదిలేస్తామని లేఖలో పేర్కొన్నట్లు బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి ఎక్స్‌లో పోస్టులు పెడుతున్నారు. ఇది బీజేపీ విజయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్

Next Story