- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక కేంద్రంపై ఆరోపణలు.. బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు హాట్ కామెంట్స్
రాష్ట్ర కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు అమలు చేయలేక కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర కాంగ్రెస్ బీసీ రిజర్వేషన్లు (BC reservations) అమలు చేయలేక కేంద్ర ప్రభుత్వంపై నెపం వేయడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు (bjp state chief ramachandra rao) ఆరోపించారు. బీసీలకు ఏమీ చేయని కాంగ్రెస్ నాయకులు తమ ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని హాట్ కామెంట్స్ చేశారు. సోమవారం తమ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి బీసీ సామాజిక వర్గానికి 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలంటే అది న్యాయపరమైన ప్రక్రియను పాటిస్తూ, చిత్తశుద్ధితో మాత్రమే సాధ్యమయ్యేదన్నారు. బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలంటే 2018 పంచాయతీ రాజ్ చట్టం (Panchayat Raj Act) సవరణ చేయాల్సి ఉంది. కానీ కాంగ్రెస్ నేతలులు దీనిని అర్థం చేసుకోలేక బీజేపీ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటూ విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ చేసింది బీసీ డిక్లరేషన్ కాదని బీసీలకు ద్రోహమని మండిపడ్డారు.
నిజంగా చట్టబద్ధతను పాటించాలనుకుంటే ఎందుకు 22 నెలలు ఆలస్యం చేసిందని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే చిత్తశుద్ధి కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు. అబద్ధపు వాగ్ధానాలు, మోసపూరిత చర్యలతో, తెలంగాణ ప్రజలు, బీసీలను మోసం చేస్తోంది.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకారం, శాస్త్రీయ పద్ధతిలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే దాకా బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదనే విషయం గుర్తుంచుకోవాలని హితువు పలికారు. ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికల గడువు ముగిసి ఏడాదిన్నర గడిచింది. అయినప్పటికీ, ప్రభుత్వం రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు నిర్వహించకుండా ఆలస్యం చేయడం దారుణమన్నారు.
తెలంగాణకు కాంగ్రెస్ (Congress) పరిపాలన వల్ల తీవ్ర నష్టం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కేంద్రం మెడలు వంచడం కాదు బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ భరతం పట్టడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తుగ్లక్ కంటే ఘోరమైన పరిపాలన చేస్తోంది.17 సెప్టెంబరు తెలంగాణ విమోచన దినోత్సవాలను ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో అధికారికంగా నిర్వహించనుంది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొని జాతీయ జెండా ఎగర వేయనున్నారు.






