మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు

by Ajay Maddhiboyina |

తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నట్టు తెలుస్తోంది.

మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్.. ప్రచారానికి బీజేపీ అగ్రనేతలు
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో రాబోయే మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరేయడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి అగ్రనేతలు రాబోతున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దఎత్తున సభలను ప్లాన్ చేసినట్టు సమాచారం అందుతోంది. ఈ సభలకు బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్, అమిత్ షా హాజరుకాబోతున్నట్టు సమాచారం. ఫిబ్రవరి 2, 3 తేదీల్లో మహబూబ్‌నగర్‌లో నితిన్‌ నబిన్‌ సభ ఉండే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఫిబ్రవరి 8, 9 తేదీల్లో నిర్మల్‌లో అమిత్‌ షా సభ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

అదే విధంగా దక్షిణ తెలంగాణలో ఒక సభ, ఉత్తర తెలంగాణలో ఒక సభ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఇప్పటికే రాష్ట్ర బీజేపీ నేతలు రాంచందర్ రావు అధ్యక్షతన శంషాబాద్ నోవటల్ హోటల్ లో భేటీ అయ్యారు. ఈ భేటీలో మున్సిపల్ ఎన్నికల ఎజెండాను సిద్ధం చేసుకున్నారు. అదే విధంగా అభ్యర్థులను ఎలా ఎంపిక చేయాలి అనేదానిపై కూడా చర్చించారు. ఈ సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ అరవింద్ తో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. బీజేపీ మున్సిపల్ ఎన్నికల కోసం నియమించిన ఇంఛార్జీలు సైతం పాల్గొన్నారు.

Next Story