- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ మంత్రి బీఆర్ఎస్ కోవర్ట్.. ఎంపీ అర్వింద్ సంచలన ఆరోపణలు
రాష్ట్ర మంత్రిపై ఎంపీ ధర్మపురి అర్వింద్ సంచలన ఆరోపణలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Minister Uttam Kumar Reddy)పై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్(Dharmapuri Arvind) సంచలన ఆరోపణలు చేశారు. ఆదివారం మున్సిపల్ ఎన్నికల(Telangana Municipal Elections) ప్రచారంలో భాగంగా మాట్లాడుతూ.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ మనిషి అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేస్తేనే పట్టణాలు అభివృద్ధి చెందుతాయని చెప్పారు. మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు లేకుండా బరిలో నిలిచిన పార్టీ బీజేపీ ఒక్కటే అని అన్నారు. మరీ ముఖ్యంగా ఎప్పటికీ బీఆర్ఎస్‌తో మాకు పొత్తు ఉండదని కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ దగ్గర డబ్బులు తీసుకుని ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్ష్యాలను మాయం చేయాలని చూశారని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎంపీ అర్వింద్ ఆరోపణలు చేశారు. కావాలనే కుట్ర పూరితంగా ఎఫ్‌ఎస్‌ఎల్‌కు నిప్పు పెట్టారని అన్నారు. మిషన్ కాకతీయ, కాళేశ్వరం కేసుల్లో డబ్బులు తీసుకుని కేసీఆర్ కుటుంబ సభ్యులను జైలు పంపడం లేదని అనుమానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏండ్లు గడుస్తున్నా ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని మండిపడ్డారు.
రేపు ఒక్కరోజే అవకాశం
రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రేపు సాయంత్రం (9వ తేదీ)తో ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండడంతో ప్రధాన పార్టీలన్నీ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే బరిలో ఉన్న అభ్యర్థుల తరపున నాయకులు రంగంలోకి దిగారు. ఉదయం నుంచి రాత్రి వరకు మైకుల్లో హోరెత్తిస్తున్నారు.






