TG: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల గాఢ నిద్ర

by Gantepaka Srikanth |

బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, పవర్ రామారావు పటేల్ ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు.

TG: అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేల గాఢ నిద్ర
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly)లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. శనివారం కృష్ణా, గోదావరి నదీ జలాలపై రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Reddy) పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఓవైపు అత్యంత కీలకమైన పీపీటీ జరుగుతుంటే.. మరోవైపు బీజేపీ ఎమ్మెల్యేలు పాల్వాయి హరీష్ బాబు, ధన్‌పాల్‌ సూర్యనారాయణ గుప్తా, పవర్ రామారావు పటేల్ ముగ్గురూ గాఢ నిద్రలోకి జారుకున్నారు. అసెంబ్లీని లైవ్ చూసిన అందరూ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావించాల్సిన చట్ట సభల్లో నిద్రపోవడం ఏంటని నెటిజన్లు మండిపడుతున్నారు.

ఎక్కడా రాజీపడం..

పీపీటీ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ.. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేవలం 30 శాతం నిధులు మాత్రమే ఖర్చు పెట్టారని ఉత్తమ్‌ తెలిపారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 2015లో జీవో ఇచ్చి 2022లో డీపీఆర్‌ సమర్పించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల కోసం పెట్టిన శ్రద్ధ పాలమూరు ప్రాజెక్టుపై పెట్టలేదని విమర్శించారు. పాలమూరు ప్రాజెక్టు వాటర్ సోర్సును మార్చడం వల్ల తీవ్ర నష్టం జరిగిందని పేర్కొన్నారు. కృష్ణా నదీ జలాల్లో ఒక్క నీటి చుక్క కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ హక్కులను కాపాడటంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీపడబోదన్నారు.

Next Story