- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HYD: ఈసీని కలిసిన బీజేపీ ఎమ్మెల్యేలు.. CM రేవంత్‌పై కంప్లైంట్
తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే ఎన్నికల సంఘం అధికారులని కలిశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ బీజేపీ(Telangana BJP) ఎమ్మెల్యే ఎన్నికల సంఘం అధికారులని కలిశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేసిన వ్యాఖ్యలపై ఈసీకి కంప్లైంట్ చేశారు. పథకాలు రద్దు అవుతాయంటూ ఓటర్లను బెదిరిస్తున్నారని.. తక్షణమే సీఎం రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి, పాయల్ శంకర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడంపై బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్, మర్రి శశిధర్ రెడ్డితో పలువురు బీజేపీ ప్రతినిధులు ఎన్నికల అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఇవ్వడం ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందకే వస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కోడ్ ఉల్లంఘించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తాజాగా మరోసారి సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేతలు ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది.






