- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరకు అన్నీ అమ్ముకొని రేవంత్ ఇటలీ పారిపోవడం ఖాయం.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన ఆరోపణ
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)పై తెలంగాణ బీజేపీ(Telangana BJP) కీలక నేత, ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములు, ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ పోతే.. హైదరాబాద్ విశ్వనగరంగా ఎలా మారుతుందని ప్రశ్నించారు. గత సీఎం కేసీఆర్ బాటలోనే రేవంత్ రెడ్డి నడుస్తున్నారని.. అసలేం మారలేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసీఆర్(KCR)పై నిప్పులు చెరిగారు.. ఇప్పుడు ఆయన కూడా అదే పనిచేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ చోచుకోగా.. మిగిలిన సంపదను కాంగ్రెస్ దోచుకుంటోందని ఆరోపించారు.
భూములను రక్షించడం ప్రభుత్వ బాధ్యత కానీ.. అమ్ముకోవడం కాదని అన్నారు. తక్షణమే భూములు అమ్ముకోవాలన్న ఆలోచనను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. హెచ్‌సీయూ విద్యార్థులను పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని మండిపడ్డారు.. ఇది ప్రజాపాలనా? లేక నియంత పాలనా? అని ప్రశ్నించారు. తెలంగాణకు కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ప్రమాదమే అని.. ఈ రెండు పార్టీల వైఖరిలను ప్రజలు గమనించాలని కోరారు. భవిష్యత్‌లో ఈ భూములన్నీ అమ్ముకొని.. రేవంత్ రెడ్డి ఇటలీ పారిపోవడం ఖాయమని మరో బీజేపీ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ(Dhanpal Suryanarayana) ఆరోపించారు. హెచ్‌సీయూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.






