- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mla Raja singh: గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, సీఎంలకు తాకుతుంది: రాజా సింగ్
బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు.

దిశ, వెబ్ డెస్క్: బక్రీద్ సందర్భంగా లక్షలాది గోవులను చంపిన పాపం ప్రతి ఎంపీకి, వారి కుటుంబానికి తాకుతుందని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. వ్యవసాయానికి పనికివచ్చే ఆవులను, ఎద్దులను చంపడం పాపం అని అన్నారు. వాటిని చంపినవారికి ఎంత పాపం తగులుతుందో అంతే పాపం భారతదేశంలోని ప్రతి ఎంపీకి తాకుతుందని చెప్పారు. వాళ్ల కుటుంబ సభ్యులకు తరతరాలకు తగులుతుందని చెప్పారు. గోవదను నిషేదించాలని పార్లమెంట్‌లో ఎందుకు బిల్ వేయడం లేదని ప్రశ్నించారు.
గతంలో కొంతమంది ప్రైవేటు బిల్ వేసినప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేయలేదో ఆలోచించాలని అన్నారు. గోవులను చంపి తిన్నవారికే కాకుండా నోరు మూసుకుని ఉన్న ఎంపీలకు, ప్రతి రాష్ట్ర ముఖ్యమంత్రికి తాకుతుందని చెప్పారు. ఇలాంటి పాపానికి గురికావద్దంటే వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో గోవదను నిషేదించాలని బిల్ తీసుకురావాలని చెప్పారు. గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. గోవదను అడ్డుకోకుండా రెండు మూడు రోజుల నుండి తమను హౌస్ అరెస్ట్ చేశారని చెప్పారు.






