‘చేతులు దులిపేసుకోవడం మాకు అలవాటు లేదు’.. రేవంత్ సర్కార్‌పై పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |

కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను పూర్తిగా నట్టేట ముంచిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు.

‘చేతులు దులిపేసుకోవడం మాకు అలవాటు లేదు’.. రేవంత్ సర్కార్‌పై పాయల్ శంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) రైతులను పూర్తిగా నట్టేట ముంచిందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్(Payal Shankar) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం హైదరాబాద్‌లోని బీజేపీ స్టేట్ ఆఫీస్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో 10 సంవత్సరాలు బీఆర్ఎస్(BRS) పరిపాలన వల్ల రైతులు ఒకరకమైన బాధలో ఉన్నారు. ఏడాదిన్నర క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ రైతుల కష్టాలు మాత్రం తీరడం లేదు. పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రైతులకు చాలా హామీలు ఇచ్చారు.. తీరా అధికారంలోకి వచ్చాక అన్నీ విస్మరించి కాలయాపన చేస్తున్నారు. రైతుభరోసా రావట్లేదు.. రుణమాఫీ పూర్తిగా కాలేదు.. కానీ రుణమాఫీ పూర్తిగా చేశామని చెప్పుకుంటున్నారు. ఇది సరైన పద్ధతి కాదని పాయల్ శంకర్ సీరియస్ అయ్యారు.

వర్షాకాలం ప్రారంభమయ్యాయి.. గ్రామాల్లో వ్యవసాయ పనులు కూడా మొదలయ్యాయి.. ప్రభుత్వం ఇప్పటివరకు రుణమాఫీ చేయలేదని మండిపడ్డారు. అప్పు పుట్టట్లేదు.. డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వాలని స్వయంగా సీఎం మాట్లాడటం ఏంటి.. ఇలాంటి మాట్లాడితే రైతుల్లో భరోసా నింపగలమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే రైతులు సంతోషంగా ఉంటారని అనుకున్నారు. కానీ బీఆర్ఎస్ ఎదుర్కొన్న పరిస్థితులను మించి ఇప్పుడు అనుభవిస్తున్నారని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ రైతుల కోసం ఎంతో చేస్తున్నారు. ఫసల్ బీమా యోజన అనే గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టారు.. ఈ పథకం వల్ల దేశంలోని రైతులు సంతోషంగా ఉన్నారు.. కానీ గతంలో పదేళ్లు పాలనలో ఉన్న బీఆర్‌ఎస్ కేవలం ఒక్క సంవత్సరం మాత్రమే ఫసల్ బీమాలో భాగస్వామ్యం అయింది. మిగతా తొమ్మిది సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదని అన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఫసల్ బీమా పథకాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు.

కాళేశ్వరం కమిషన్ విషయంలో కేసీఆర్‌ను బహిరంగంగా విచారణచ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కరప్షన్స్ అన్నీ వెలుగులోకి రావాలంటే సీబీఐ దర్యాప్తే సరైనదని స్పష్టం చేశారు. ఈ అంశంలో కేసీఆర్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తుందేమోననే అనుమానం కలుగుతోందని ఆరోపించారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పదే పదే కేంద్రం రాష్ట్రప్రభుత్వానికి సహకరించడం లేదని మాట్లాడటం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ నేతల్లా హామీలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చాక చేతులు దులుపుకోవడం తమకు అలవాటు లేదని అన్నారు.

Next Story