GHMC కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు

by Gantepaka Srikanth |

GHMC కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు

GHMC కమిషనర్‌ను కలిసిన బీజేపీ నేతలు
X

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీలో డీలిమిటేషన్‌(GHMC Delimitation)పై దుమారం చెలరేగుతున్నది. ఎలాంటి శాస్త్రీయత పాటించకపోవడంతో పాటు పాలనా సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకోకుండానే వార్డులను అడ్డగోలుగా విభజించారంటూ బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇదే విషయమై మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో బీజేపీ ప్రతినిధుల బృందం గురువారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్‌ను కలిశారు. ఈ సందర్భంగా GHMC వార్డుల విభజన (Delimitation) మరియు గెజెట్ నోటిఫికేషన్‌పై పారదర్శకత కోరుతూ, సంబంధిత సమస్యలపై చర్చించారు. ఈ బృందంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. ఎన్.గౌతం రావు, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, మాజీ మంత్రి కృష్ణ యాదవ్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, అమర్ నాథ్ సారంగుల, మాజీ డిప్యూటీ మేయర్ సుభాష్ చందర్, GHMC పరిధిలోని బీజేపీ జిల్లా అధ్యక్షులు మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Next Story