- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ చరిత్రను వక్రీకరిస్తోంది.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
పార్లమెంట్ (Parliament)లో జాతీయ గీతం వందేమాతరంపై చర్చ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament)లో జాతీయ గీతం వందేమాతరంపై చర్చ సందర్భంగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Kiran Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన ఢిల్లీ (Delhi)లో మీడియాతో మాట్లాడుతూ.. 1896లో రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ ప్రజల కోసం కాంగ్రెస్ సెషన్స్‌లో వందేమాతరం పాడారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఐసీసీ (AICC), పీసీసీ (PCC), డీసీసీ (DCC) మీటింగ్స్‌లో వందేమాతరం గీతాన్ని పాడతామని పేర్కొన్నారు. కానీ, ఈ బీజేపీ నాయకులు తమ పార్టీ కార్యక్రమాలు, ఆర్‌ఎస్‌ఎస్ మీటింగ్స్‌లో జాతీయ గీతాన్ని ఆలపించరని ఆరోపించారు. అకస్మాత్తుగా బీజేపీ వందేమాతరంపై పార్లమెంట్‌లో చర్చ పెట్టి మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూలను చెడుగా చూపించేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ పార్టీ తరపున నేడు తాము చర్చలో పాల్గొని ప్రజలకు వాస్తవాలు చెప్తామని అన్నారు. బీజేపీ (BJP) వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా కాంగ్రెస్ నాయకులపై విష ప్రచారం జరుగుతోందని ధ్వజమెత్తారు. బీజేపీ చరిత్రను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 15 రోజులు మాత్రమే నడపడం కరెక్ట్ కాదని.. దేశంలో అనేక సమస్యలపై చర్చ జరగాలన్నారు. ఇండిగో విమానయాన సంస్థ వల్ల ఇబ్బందులు పడుతున్న ప్రజల గురించి, ఢిల్లీ కాలుష్యం, దేశంలో నిరుద్యోగ సమస్యలపై పార్లమెంట్‌లో డిస్కషన్ జరగాలన్నారు. కేవలం ఎన్నికలు, రాజకీయాల గురించి మాత్రమే బీజేపీ మాట్లాడుతోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.






