- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం : ఎంపీ ఆర్ కృష్ణయ్య
ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం దేశ చరిత్రలో మరువలేదని, ఇది బీజేపీ పాలనకు అద్దం పడుతోందని బీసీ సంక్షేమం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : ఇటీవల కేంద్రం ప్రభుత్వం తీసుకున్న కుల గణన నిర్ణయం దేశ చరిత్రలో మరువలేదని, ఇది బీజేపీ పాలనకు అద్దం పడుతోందని బీసీ సంక్షేమం జాతీయ అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. కుల గణన అంశంపై తాము కేంద్రంపై ఒత్తిడి చేయడంతో నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్నేతలు పదే పదే పేర్కొనడం మానుకోవాలని హెచ్చరించారు. వారు ఎన్నో ఏళ్లు దేశాన్ని పాలించినప్పడు కులగణన ఎందుకు గుర్తురాలేదని, మోడీ నిర్ణయం తీసుకోగానే తమ పార్టీ ఉనికి కోల్పోతుందనే భయంతో ఈ కుట్రలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం చేపట్టే కులగణనకు రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు సహకరించాలని, దీనిపై ప్రజలకు లేనిపోని అనుమానాలు కలిగేలా వ్యాఖ్యలు చేయవద్దని సూచించారు.
బ్రిటిష్పాలకులు మాత్రమే కుల గణన చేశారని, తరువాత పాలించిన కాంగ్రెస్నేతలు ఏనాడు దీని గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రాష్ట్రంలో బీజేపీకి రోజు రోజుకు బలం పెరుగుతుందని, కుల గణన ప్రకటనతో మరింత బలం చేకూరందని పేర్కొన్నారు. తెలంగాణ బీజేపీ అధికారం చేపట్టం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన కుంటు పడిందని, రేవంత్సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక తప్పించుకునే ఎత్తుగడలు వేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇటీవల చేపట్టిన కులగణన తప్పల తడకగా ఉందని, బీసీలను తక్కువగా చూపించి రిజర్వేషన్లు రాకుండా కుట్రలు చేశారని మండిపడ్డారు. కులగణన నిర్ణయంతో తెలంగాణ ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని వెల్లడించారు.
- Tags
- R Krishnaiah






