- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KTR : బీజేపీకి తెలంగాణలో బలం లేదు.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
గతంలో కానీ భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.

దిశ, డైనమిక్ బ్యూరో : గతంలో కానీ భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. సోమవారం అదిలాబాద్, మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలతో మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణలో బీజేపీ ఏనాటికీ కాంగ్రెస్ పార్టీ దుర్మార్గ పాలనకు ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేళ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, కచ్చితంగా మరోసారి భారత రాష్ట్ర సమితి వైపు నిలిచేందుకు ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని కేటీఆర్ తెలిపారు. అందుకే మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మొదలుకొని పంచాయతీ సర్పంచుల వరకు ప్రతి ఎన్నికల్లో బీఆర్ఎస్ వైపు ప్రజలు నిలబడ్డారన్నారు. రాష్ట్రంలో రెండు ఏండ్ల కింద జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం గాలివాటమే అని, ఆనాడు దేశంలోని రాజకీయ పరిస్థితులు కేవలం ద్విదృవంగా మారడం వలన, ఎన్నడూ లేని ఒక విభిన్నమైన పరిస్థితి ఏర్పడడం వలన బీజేపీ గెలిచిందే తప్ప.. గతంలో కానీ.. భవిష్యత్తులో కానీ బీజేపీకి తెలంగాణలో క్షేత్రస్థాయి బలం లేదని తీవ్ర విమర్శలు చేశారు.
కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదు
అసెంబ్లీలో పోటీ చేసిన ప్రతి ఒక్క బీజేపీ సీనియర్ నేత ఘోరమైన ఓటమి పాలయ్యారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గాలివాటంగా గెలిచారన్నారు. బీజేపీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని కేటీఆర్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అరాచకాలపైన, అవినీతిపైన, అక్రమాలపైన 24 నెలలుగా తెలంగాణ ప్రజల పక్షాన కొట్లాడుతున్న పార్టీ బీఆర్ఎస్ అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో చేసిన అధికార దుర్వినియోగం, చెప్పిన తప్పుడు లెక్కలు అన్నీ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో తేలిపోతాయని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నప్పటికీ.. కృష్ణా జలాల నుంచి మొదలుకొని అంతర్రాష్ట్ర వ్యవహారాల్లో తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నా.. బీజేపీ ఒక్క మాట కూడా మాట్లాడడం లేదని కేటీఆర్ అన్నారు.
అందుకే తెలంగాణ ప్రయోజనాలకు, భవిష్యత్తుకు వ్యతిరేకులైన ఈ రెండు జాతీయ పార్టీలను, వారి తెలంగాణ వ్యతిరేక ఎజెండాలను ప్రజలు గమనిస్తున్నారని కేటీఆర్ అన్నారు. అందుకే ఈ రెండు పార్టీలకు రానున్న భవిష్యత్తులో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పురపాలక ఎన్నికల్లో సమిష్టిగా కలిసి కొట్లాడి కాంగ్రెస్ పైన ఘనమైన విజయం సాధించేలా ప్రయత్నం చేయాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లోని మున్సిపాలిటీలలో ఉన్న స్థానిక పరిస్థితుల పైన వివరాలు అడిగి తెలుసుకున్నారు.






