- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భారీ వర్షాలు.. తెలంగాణ ప్రజలకు బీజేపీ చీఫ్ కీలక సూచన
తెలంగాణ ప్రజలకు బీజేపీ చీఫ్ కీలక సూచనలు చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: భారీ వర్షాలు(Heavy Rains), వరదల వేళ తెలంగాణ ప్రజలకు బీజేపీ(Telangana BJP) రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchander Rao) కీలక పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం సోషల్ మీడియా వేదికగా ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో రాబోయే రోజుల్లో వర్షాలు మరింత తీవ్రంగా కురిసే అవకాశం ఉంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను అని పేర్కొన్నారు. ఈ వరదలలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలిపారు. ‘తాను నిరంతరం రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలతో సమన్వయం చేస్తున్నాను. అలాగే మన రాష్ట్ర కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌లు కూడా ఈ అంశంపై నిరంతరంగా సంప్రదింపులు జరుపుతున్నారు. ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం. ఎటువంటి ఆందోళన అవసరం లేదు. తెలంగాణ బీజేపీ ఎల్లప్పుడూ మీతో ఉంది, మీ కోసం నిలుస్తుంది’ అని రాంచందర్ రావు భరోసా ఇచ్చారు.






