- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక.. నామినేషన్ వేసేందుకు వచ్చిన బీజేపీ అభ్యర్థి భార్య.. నో ఎంట్రీ!
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో నామినేషన్‌ల పర్వం కొనసాగుతోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక (Jubilee Hills by-election) నేపథ్యంలో నామినేషన్‌ల పర్వం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే శుక్రవారం జూబ్లీహిల్స్‌లోని RO ఆఫీస్ వద్ద స్పల్ప గందరగోళం వాతావరణం నెలకొంది. జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి తరఫున నామినేషన్ వేసేందుకు తన భార్య వచ్చినట్లు తెలుస్తోంది. నామినేషన్లు స్వీకరించే సమయం మించిపోవడంతో.. లోపలికి వెళ్లేందుకు పోలీసులు అనుమతించలేదని సమాచారం. ఈ క్రమంలోనే.. దీపక్ రెడ్డి అనుచరులు, పోలీసుల మధ్య కాసేపు వాగ్వివాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతిస్తేనే పోలీసులు లోనికి పంపుతామని వారికి తేల్చి చెప్పినట్లు సమాచారం. కాగా, ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరణ జరుగనుంది. ఈ నెల 22న నామినేషన్ల పరిశీలన, 24వ తేదీ వరకు ఉపసంహరణకు అవకాశం ఇచ్చారు. వచ్చే నెల 11న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. 16 న ఎన్నికల ప్రక్రియ పూర్తి స్థాయిలో ముగియనుంది. వీడియో లింక్..






