జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతుపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

by Malleboina Mahesh |   (  Updated:2025-11-14 08:31:17  IST  )

యావత్ తెలంగాణ రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూసిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

జూబ్లీహిల్స్‌లో డిపాజిట్ గల్లంతుపై బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: యావత్ తెలంగాణ రాష్ట్రం ఆసక్తిగా ఎదురు చూసిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు (votes Counting) కొనసాగుతోంది. ఇందులో మొదటి రౌండ్ నుంచి లీడ్ కనబరించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు ఎనిమిదో రౌండ్ ముగిసే సమయానికి 22 వేలకు పైగా మెజార్టీ దక్కింది. అయితే మరో రెండు రౌండ్ల ఓట్ల లెక్కింపు మాత్రమే మిగిలి ఉండటం, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి కేవలం 9,100 ఓట్లు మాత్రమే రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

దీంతో బీజేపీ అభ్యర్థి ఏడో రౌండ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు కేంద్ర నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎన్నికల్లో డబ్బుల ప్రభావం ఎక్కువగా ఉంది. పెద్ద ఎత్తున అధికార దుర్వినియోగం చేశారు. చివరి మూడు రౌండ్లు బీజేపీకి అనుకూలంగా ఉంటాయి. నాకు డిపాజిట్ (Deposit) వస్తుందనే భావిస్తున్నాను అని బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

READ MORE .....

షేక్ పేటలో బీజేపీకి జీరో ఓట్లు.. కనీసం ఏజెంట్లు కూడా వేయలేదా?

Next Story