- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సచివాలయ ముట్టడికి బీజేపీ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత, పలువురు కార్పొరేటర్లు అరెస్ట్
జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ‘సేవ్ హైదరాబాద్’ (Save Hyderbad) పేరుతో.. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: జీహెచ్‌ఎంసీ (GHMC) పరిధిలో సమస్యలను పరిష్కరించాలని ‘సేవ్ హైదరాబాద్’ (Save Hyderbad) పేరుతో.. ఇవాళ గ్రేటర్ హైదరాబాద్ బీజేపీ శ్రేణులు తెలంగాణ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చాయి. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఇవాళ తెల్లవారుజాము నుంచే నగరంలోని బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కార్పొరేటర్లను గృహ నిర్బంధం చేశారు. ఈ క్రమంలోనే మరికొందరు నాయకులు, కార్పొరేటర్లు పోలీసుల కళ్లుగప్పి తెలంగాణ సెక్రటేరియట్ వద్దకు చేరకున్నారు. కరెంట్ తీగలతో మరణాలు, జీహెచ్ఎంసీ సమస్యలపై ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేవారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన సాగుతోందిన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక సచివాలయం మెయిన్ గేటు నుంచి వారు లోనికి వెళ్లేందుకు యత్నించగా.. అక్కడే భద్రతా సిబ్బంది బీజేపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో కమలం శ్రేణులు, పోలీసులకు మధ్య స్వల్ప తోపులాట చోటుచేసుకంది. ఈ మేరకు బీజేపీ కార్పొరేటర్లను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి సమీప పీఎస్‌కు తరలించారు.






