- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కొత్త ఆసరా పింఛన్లపై బిగ్ అప్‌డేట్.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ (Telangana)లో కొత్త పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు (New Aasara Pensions) అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) ప్రకటించారు. ఖమ్మం జిల్లా జీళ్లచెరువులో నిర్వహించిన ‘ప్రజాదర్బార్’ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి స్థానిక ప్రజల నుంచి సమస్యలను అడిగి తెలుసుకుని, పింఛన్లు, రేషన్ కార్డులు, ఇతర సామాజిక పథకాలకు సంబంధించిన అర్జీలను స్వయంగా స్వీకరించారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. త్వరలోనే పింఛన్ల పంపిణీపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా తీపికబురు చెబుతుందని వెల్లడించారు. క్షేత్రస్థాయిలో అర్హులను గుర్తించి, రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ న్యాయం చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి భరోసానిచ్చారు. మంత్రి తాజా ప్రకటనతో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పింఛన్ల కోసం వేచి చూస్తున్న లబ్ధిదారుల్లో ఆసక్తి నెలకొంది.
జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి..
అయితే, రాష్ట్రంలో ప్రస్తుతం 42.23 లక్షల మంది పెన్షన్ తీసుకుంటుండగా.. జూన్ 2న కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకోసం నిధులను సైతం బడ్జెట్‌లో కేటాయించింది. ప్రస్తుతం వృద్ధాప్య పెన్షన్ కోసం 4.6 లక్షల మంది, వితంతువు, ఒంటరి మహిళల పెన్షన్ కోసం 3.5 లక్షలు.. గీత, చేనేత కార్మికుల పెన్షన్ కోసం 3.2 లక్షలు, దివ్యాంగుల పెన్షన్ కోసం 90 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రతి గ్రామం నుంచి వచ్చిన దరఖాస్తుల్లో ముందుగా దివ్యాంగులు, హెచ్ఐవీ, పైలేరియా బాధితులకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలని ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నది. ఆ తర్వాతే వితంతువు, ఒంటరి మహిళలకు, చివరగా వయోవృద్ధులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది.






