TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్

by Gantepaka Srikanth |

ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కీలక ప్రకటన చేశారు.

TG Govt: ఇందిరమ్మ ఇళ్లపై బిగ్ అప్డేట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Illu)పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Ponguleti Srinivasa Reddy) కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధుతులతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లా తాము చేయబోమని.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కూడా ఇందిరమ్మ ఇళ్ల కోటా కేటాయిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెంచులకు ఒకే దశలో తొమ్మిది వేల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వబోతున్నామని.. త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామని అన్నారు. తెలంగాణ నుంచి ఏపీలో కలిసిన ఏడు మండలాల ప్రజల స్థానికతపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పొలిటికల్‌గా తమకు నష్టం జరిగినా సరే.. అత్యంత పేదవారికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.

600 చదరపు అడుగుల నిబంధన పెట్టింది కూడా పేదలకు లబ్ధి జరగాలనే అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. పేదలకు సొంతింటి కలను నెరవేర్చేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు వేగంగా నడుస్తోంది. అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు.. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై మరింత దృష్టి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే డిసెంబర్​వరకు పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు.

Next Story