- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సొంత ఇలాకాలో కేటీఆర్ కు బిగ్ షాక్!
పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. లోక్ సభ ఎన్నికల్లో కేటీఆర్ సొంత ఇలాకా అయిన సిరిసిల్ల నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న సిరిసిల్ల అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధిక ప్రజలు బీజేపీకే మొగ్గు చూపారు. కేటీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కరీంనగర్ బీజేపీ ఎంపీ అభ్యర్ధి బండి సంజయ్ కి 6748 ఓట్ల మెజారిటీ రావడం గమనార్హం. దీంతో బీఆర్ఎస్ కు రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా పార్టీ ప్రముఖ నేతల సొంత ఇలాకాలో సైతం పెద్ద దెబ్బ పడ్డట్టు అయ్యింది.
ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి కొంత నిరాశలో ఉన్న బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఫలితాలు మరింత నైరాశ్యంలోని నెట్టేశాయి. ఇదిలా ఉండగా బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానమైన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికల్లో కూడా కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. దీంతో బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన సీట్లలో మరో స్థానం కోల్పోయినట్లు అయ్యింది. ఇక ఈ ఫలితాలతో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు చెబుతున్నట్లు నిజంగానే బీఆర్ఎస్ కనుమరుగయ్యే పరిస్థితులు వచ్చాయా? అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో ఉన్నట్లు తెలుస్తోంది.






