సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?

by Kema Shiva Kumar |   (  Updated:2025-07-16 05:30:17  IST  )

కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డికి తన సొంత గ్రామంలో పరాభవం ఎదురైంది.

సొంత గ్రామంలో ఎమ్మెల్యేకు బిగ్ షాక్.. అసలు ఏం జరిగిందంటే?
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే యశస్విని రెడ్డి (Yashaswini Reddy)కి తన సొంత గ్రామంలోనే ఘోర పరాభవం ఎదురైంది. పాలకుర్తి (Palakurti) నియోజకవర్గం, తొర్రూరు మండల పరిధిలోని చర్లపాలెం (Cherlapalem) గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎక్కటి నాగిరెడ్డి తన పదవికి రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించారు. అయితే, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, అత్త ఝాన్సీరెడ్డి తీరుపై తీవ్ర అసంతృప్తితోనే పదవికి రాజీ చేస్తున్నాయని వెల్లడించారు. గత ఎనిమిదేళ్లుగా నుంచి పార్టీలో ఉంటూ ఎన్నికల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గెలుపు కోసం కష్టపడినా ఎలాంటి ఫలితం లేదని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి (Tirupati Reddy కలిసి తాను పలు కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు గాను ఎమ్మె్ల్యే అత్త ఝాన్సీ‌రెడ్డి (Jhansi Reddy) తనను తీవ్రం ఇబ్బందులకు గురిచేస్తుందని నాగిరెడ్డి తన రాజీనామా లేఖలో ప్రస్తావించాడు.

Next Story