మాంసం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-06-01 08:44:00  IST  )

రెండు రాష్ట్రాల మాంసం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది.

మాంసం ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన చికెన్ ధరలు
X

దిశ,వెబ్‌డెస్క్: రెండు రాష్ట్రాల మాంసం ప్రియులకు ఊహించని షాక్ తగిలింది. తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా చికెన్ ధరలు పెరిగాయి. గత వారంతో పోలిస్తే చికెన్ ధరలు 20-30 రూపాయల వరకు పెరిగింది. ఈ క్రమంలో హైదరాబాద్, విజయవాడ, వరంగల్, విశాఖపట్నంలో కేజీ చికెన్ రూ.260-280కి విక్రయిస్తున్నారు. కొన్ని చోట్ల డిమాండ్ ఎక్కువై, ధరలు మరింత పెరిగినట్లు తెలుస్తోంది.

అయితే.. ఓ వైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రోటీన్ ఫుడ్‌గా చికెన్, గుడ్లకు ఆదరణ పెరిగింది. కరోనా నుంచి బయటపడడానికి చాలామంది చికెన్, గుడ్లు అధికంగా తింటారు. దీంతో దుకాణదారులు రేట్లను పెంచడంతో చికెన్ కొనుగోలుదారులు ఆలోచనలో పడుతున్నారు. ఈ తరుణంలో నాన్‌వెజ్ ధరలు పెరగడంతో మాంసం ప్రియులు షాక్‌కి గురవుతున్నారు.

Next Story