- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారులకు బిగ్ షాక్.. ఎల్2 నుంచి ఎల్3గా మార్పు
ఇందిరమ్మ పథకంలో భాగంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల కొద్ది సొంత ఇళ్లు లేని వారు కిరాయి ఇంటికి అద్దె చెల్లిస్తూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ..

దిశ, వెబ్ డెస్క్: ఇందిరమ్మ పథకంలో భాగంగా హైదరాబాద్‌తో పాటు ఇతర ప్రాంతాల్లో డబుల్ బెడ్ ఇళ్ల కోసం అప్లికేషన్ పెట్టుకున్న వారికి బిగ్ షాక్ తగిలింది. ఏళ్ల కొద్ది సొంత ఇళ్లు లేని వారు కిరాయి ఇంటికి అద్దె చెల్లిస్తూ ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్షల్లో వచ్చిన అప్లికేషన్లను ఎల్1, ఎల్2, ఎల్3 కేటగిరిగా నిర్ణయించారు. స్థలం ఉండి, ఇళ్లు లేని పేదలను ఎల్1గా, ఎలాంటి ఇళ్లు, స్థలం లేని వాళ్లను ఎల్2 కేటగిరిలో చేర్చారు. ఇప్పటికే సొంత ఇళ్లు ఉండి దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్3లో చేర్చారు. అయితే స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లను ఇందిరమ్మ పథకం ద్వారా రుణాలు మంజూరు చేసి సొంతింటి కలకు సహకారం అందిస్తున్నారు.
ఎల్2 నుంచి ఎల్3కు మార్పు
అయితే ఇందిరమ్మ పథకం ద్వారా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేసింది. దరఖాస్తులను తరవుగా పరిశీలిస్తోంది. ఆధార్, రేషన్ కార్డు ఆధారంగా వెరిఫికేషన్ చేస్తోంది. దీంతో చాలా మంది దరఖాస్తు దారులకు సొంత ఇల్లు, కరెంట్ మీటర్లు ఉన్నట్లు చూపించడంతో ఎల్2 దరఖాస్తులను ఎల్3లోకి మార్చుతోంది. దీంతో హైదరాబాద్‌లో దరఖాస్తు చేసుకుని ఎల్2 కేటగిరిలో ఉన్న వాళ్లకు ఆన్ లైన్ పోర్టల్‌లో ఎల్3 కేటగిరి చూపిస్తోంది. దీంతో దరఖాస్తు దారులు ఆందోళన చెందుతున్నారు. తాము ఏళ్ల తరబడి హైదరాబాద్‌లో ఉన్నామని, ఇంటి అద్దెలు కూడా చెల్లిస్తున్నామని తమను ఎందుకు ఎల్3 కేటగిరిలోకి మార్చారని ప్రశ్నిస్తున్నారు.
తీవ్ర ఆవేదన
గతంలో ఎల్2 చూపించి ఇప్పుడు భారీగా ఎల్-3 చూపిస్తుండటంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దరఖాస్తులను మరోసారి పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు. తమకు ఎక్కడా ఇల్లు, పొలాలు లేవని అయినా సరే ఇలా ఎల్-3 చూపించడమేంటని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తమకు అన్యాయం చేస్తోందని వాపోతున్నారు.
మరోవైపు L2 నుంచి L3 మార్పు చేయడంపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలని పలువురు దరఖాస్తుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇళ్లు ఉండి మళ్లీ దరఖాస్తు చేస్తే ఎ3 కేటగిరి కథా అని, మరి ఈ మార్పు చేసిన వారందరికి ఇల్లు వస్తుందా..?, రాదా అనేదానిపై స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు.






