ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి

by Malleboina Mahesh |   (  Updated:2025-12-16 13:00:18  IST  )

ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనే విచారణలను ఎదుర్కొన్న ఆతడిని మరో 4 కేసుల్లో 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది.

ఐబొమ్మ రవికి బిగ్ షాక్.. 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి
X

దిశ, వెబ్ డెస్క్: ఐబొమ్మ రవికి మరో బిగ్ షాక్ తగిలింది. ఇప్పటికే అనే విచారణలను ఎదుర్కొన్న ఆతడిని మరో 4 కేసుల్లో 12 రోజుల విచారణకు కోర్టు అనుమతి ఇచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీని ముప్పుతిప్పలు పెట్టిన ఐ బొమ్మ వెబ్ సైట్‌ (I Bomma website)ను హైదరాబాద్ పోలీసులు బ్లాక్ చేయించిన విషయం తెలిసిందే. గతంలో పోలీసులకే సవాల్ విసిరిన ఐ బొమ్మ వెబ్ సైట్ నిర్వాహకుడితోనే ఐ బొమ్మ , బప్పం వెబ్ సైట్ బ్లాక్ చేయించారు. రెండు సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పట్టుకోండి చూద్దాం అంటూ పోలీసులకు సవాల్ విసిరాడు. అప్పటి నుంచి ఈ విషయాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు.

దీంతో అతనిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు కావడంతో అతన్ని విచారించేందుకు కోర్టు అనుమతి కోరారు. తాజాగా ఐబొమ్మ రవికి మరోసారి పోలీస్‌ కస్టడీలోకి తీసుకొనున్నారు. 4 కేసులో 12 రోజుల పాటు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. ఒక్కో కేసులో ఐబొమ్మ రవి (I Bomma Ravi)ని మూడు రోజులు విచారించాలని నాంపల్లి కోర్టు (Nampally Court) పోలీసులకు సూచించింది. దీంతో గురువారం నుంచి ఐబొమ్మ రవిని 12 రోజుల పాటు సైబర్‌ క్రైమ్‌ పోలీసులు వివిధ అంశాలపై ప్రశ్నించనున్నారు.

విదేశాల్లో ఉంటూ వందకు పైగా పైరసీ వెబ్‌సైట్‌లను నడిపిన రవి, ఈ అక్రమ కార్యకలాపాల ద్వారా సుమారు రూ. 20 కోట్లు సంపాదించినట్లు, ఆ మొత్తంతో ప్లాట్లు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పోలీసులు అతడి ఖాతాల్లోని దాదాపు రూ. 3 కోట్లను ఇప్పటికే ఫ్రీజ్ చేశారు. విడాకుల అంశంపై చర్చించేందుకు ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్ వచ్చిన రవిని నెల రోజుల నిఘా తర్వాత పోలీసులు పట్టుకున్నారు. ఈ కస్టడీ విచారణ ద్వారా పైరసీ నెట్‌వర్క్ వెనుక ఉన్న పూర్తి వివరాలు, ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకోవాలని సైబర్‌ క్రైమ్‌ పోలీసులు భావిస్తున్నారు.

Next Story