- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సిట్టింగ్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్!
పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో సీఎం రేవంత్ రెడ్డికి బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది.రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానం అయిన మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ వెనుకంజలో ఉంది. బీజేపీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ మొదటి నుండి లీడ్ లో కొనసాగుతున్నారు. పొస్టల్ బ్యాలెట్ ఓట్ల నుంచి చూసుకుంటే, ఇప్పటి వరకు పూర్తయిన రౌండ్లలో బీజేపీనే ముందంజలో ఉంది. కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా మహేందర్ రెడ్డి ఒక్కసారి కూడా లీడ్ లోకి రాకపోవడం గమనార్హం. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా గెలుపొందారు.
మల్కాజ్ గిరి తన సిట్టింగ్ స్థానం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్ధి సునీతా మహేందర్ రెడ్డి గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సీఎం సిట్టింగ్ స్థానం కావడం, పైగా రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో మల్కాజ్ గిరి గెలుపుపై సీఎం రేవంత్ రెడ్డి ధీమాగా ఉన్నారు. కానీ అనూహ్యంగా ఇప్పటివరకు పూర్తయిన లెక్కింపులో ఒక్కసారి కూడా కాంగ్రెస్ ముందంజలోకి రాలేదు. కాగా బీఆర్ఎస్ లో ఉన్న ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఆయన సతీమణి సునీతా మహేందర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. సునీతా మహేందర్ రెడ్డికి ముందుగా చేవేళ్ల పార్లమెంట్ సీటు కేటాయించినా.. అక్కడ సిట్టింగ్ ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోవడంతో మల్కాజ్ గిరి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలో నిలిచారు.






