- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాత పద్ధతిలోనే SSC పరీక్షలు
తెలంగాణ పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఈనెల 14 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి, గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జవాబు పత్రానికి (ఆన్సర్ బుక్ లెట్) ఓఎంఆర్ షీట్‌ను జత చేసే విధానాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ వెల్లడించారు. విద్యార్థులు సమాధాన పత్రంతో పాటు ఉన్న ఓఎంఆర్ షీట్‌ను తప్పనిసరిగా ఉపయోగించాల్సి ఉంటుంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. విద్యార్థులు పరీక్షా విధానంపై అవగాహన పెంచుకోవడానికి వీలుగా ఓఎంఆర్ షీట్, జవాబు పత్రం యొక్క నమూనా కాపీలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. విద్యార్థులు www.bse.telangana.gov.in, https://schooledu.telangana.gov.in ద్వారా నమూనా పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుగానే ఈ ఫార్మాట్‌పై అవగాహన కల్పించేందుకు ఈ నమూనా పత్రాలను విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.






