- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల హాల్ టికెట్లు విడుదల
ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇవాళ విడుదల చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులకు బిగ్ అలర్ట్. అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి హాల్‌టికెట్లను ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ఇవాళ విడుదల చేశారు. ఈ మేరకు పరీక్షకు హాజరు కాబోయే విద్యార్థులు తమ కళాశాలల్లో హాల్‌టికెట్లను తీసుకోవచ్చు. లేని పక్షంలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ www.tgbie.cgg.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఈ నెల 22 నుంచి 29 వరకు ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను రెండు సెషన్ల వారీగా నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు మొదటి సంవత్సరం పరీక్షలు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరగనున్నాయి.
కాగా, ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 4,12,724 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. అందులో ఫస్టియర్ జనరల్ విద్యార్థులు 2,49,032 మంది కాగా.. ఒకేషనల్ విద్యార్థులు 16,994 మంది ఉన్నారు. అయితే, ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో తొలి ఏడాదిలో ఫెయిలైన విద్యార్థుల సంఖ్య 1.91 లక్షల మంది కాగా.. మార్కులు పెంచుకునేందుకు ఇంప్రూవ్‌మెంట్ రాసేవారు ఏకంగా 50 వేల మందికి పైగా దరఖాస్తు చేసుకున్నారు. దీంతో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష రాసే విద్యార్థుల పెరిగింది. ఇక సెకండియర్ జనరల్ పరీక్షలకు 1,34,341 మంది విద్యార్థులు, ఒకేషనల్ పరీక్షలకు 12,357 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.






