- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. నిలిచిన ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ప్రక్రియ
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి ఎప్‌సెట్ (EAPCET) ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో బీటెక్ (B.Tech) సీట్ల భర్తీకి ఎప్‌సెట్ (EAPCET) ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. గత ఏడాది మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మొత్తం మూడు విడతల్లో కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 18 నుంచి కళాశాలల్లో బ్రాంచీలు మార్చుకునే స్లైడింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఇంజినీరింగ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ఒక్కసారిగి నిలిచిపోయింది. గత రెండు గంటలుగా సర్వర్లు (Servers) మోరాస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ జూన్ 7న ముగియనుండటంతో సర్వర్ కష్టాలు అందరిలోనూ టెన్షన్ పెట్టిస్తున్నాయి.
కాగా, మొదటి ఫేజ్ కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసిన వెంటనే స్లాట్ బుకింగ్, పేమెంట్ ఆన్‌లైన్ (Online) విధానంలో చేయాల్సి ఉంటుంది. జులై 1 నుంచి 8 వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుంది. జులై 6 నుంచి 10 వరకు కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశం ఇస్తారు. ఆ వెంటనే జూలై 10న ఫ్రీజింగ్ ఆప్షన్లను కూడా ఇస్తారు. ఇక జులై 13న మాక్ సీట్ కేటాయింపు, జులై 14, 15న కాలేజీల ఎంపికలో మార్పు చేసుకునే చాన్స్ ఉంటుంది. జులై 18న ఫస్ట్ ఫేజ్‌లో సీట్లను పొందిన వారు జూలై 22 వరకు ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్‌సైట్‌లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.






