- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్ఎస్‌సీ (SSC), ఇంటర్మీడియట్ (Intermediate) సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (TOSS) సెప్టెంబర్ 22 నుంచి 28 వరకు నిర్వహించిన ఎస్ఎస్‌సీ (SSC), ఇంటర్మీడియట్ (Intermediate) సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు www.telanganaopenschool.org వెబ్‌సైట్‌లో తమ ఫలితాలను చూసుకోవచ్చని, డౌన్‌లోడ్ చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. ఎస్ఎస్‌సీ పరీక్షకు 9,717 మంది హాజరు కాగా 4,748 మంది (48.86 శాతం) ఉత్తీర్ణులయ్యారని, అందులో 2,900 మంది బాలురు, బాలికలు 1,848 మంది ఉన్నారని తెలిపారు.
ఇక ఇంటర్మీడియట్ పరీక్షకు 11,520 మంది హాజరు కాగా 6,706 మంది (58.21 శాతం) ఉత్తీర్ణులయ్యారని, అందులో బాలురు 4,419 మంది, బాలికలు 2,287 మంది ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. పరీక్షకు సంబంధించి మార్కుల జాబితా మరో 25 రోజుల్లో ఆయా విద్యా సంస్థలకు అందజేస్తామని, అక్టోబర్ 31 సాయంత్రం నుంచి వెబ్ ద్వారా మార్కుల మెమోరాండం డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంటుందన్నారు. మార్కుల మెమోలో ఏమైనా తప్పిదాలు ఉంటే నవంబర్ 14లోపు సంబంధిత డీఈవో/ప్రిన్సిపల్ ద్వారా TOSS రాష్ట్ర కార్యాలయానికి తెలియజేయాలన్నారు. అదేవిధంగా పరీక్ష పత్రం రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు నవంబర్ 4 నుంచి 12 వరకు ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. రీకౌంటింగ్‌కు ఇంటర్‌కు (రూ.400), ఎస్ఎస్‌సీకి (రూ.350) ప్రతి సబ్జెక్టు రుసుము ఉంటుందన్నారు.






