ఫలించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృషి

by Ajay Maddhiboyina |

లోక్ సభలో తాను జూట్ క్రాఫ్ పై ప్రశ్న అడిగిన తర్వాత హైదరాబాద్ కు జూట్ కార్పొరేషన్ అధికారులు వచ్చారని, జూట్ ప్రొడక్షన్ పై ఆ అధికారులతో చర్చ జరిపినట్లుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు.

ఫలించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కృషి
X

దిశ, తెలంగాణ బ్యూరో : లోక్ సభలో తాను జూట్ క్రాఫ్ పై ప్రశ్న అడిగిన తర్వాత హైదరాబాద్ కు జూట్ కార్పొరేషన్ అధికారులు వచ్చారని, జూట్ ప్రొడక్షన్ పై ఆ అధికారులతో చర్చ జరిపినట్లుగా భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో జూట్ ప్రొడక్షన్ ఎందుకు చేయడం లేదన్న ప్రస్తావన వచ్చినట్లుగా ఆయన చెప్పారు. ఈ మేరకు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ జూట్ క్రాఫ్ వలన భూమికి, పర్యావరణానికి మంచి జరుగుతుందని, ఈ క్రాఫ్ వలన ఎకరానికి లక్ష రూపాయల ఆదాయం వస్తుందన్నారు. జూట్ క్రాఫ్ ను తెలంగాణలో పండించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవగాహన కల్పించాలని, దీనితో పాటు ఈ క్రాఫ్ పై తెలంగాణ రైతులకు అవగాహన కల్పించడం కోసం జూట్ కార్పోరేషన్ అధికారులు కృషి చేయాలని ఎంపీ చామల అన్నారు. కాగా, పార్లమెంట్ టెక్స్ టైల్స్ స్టాండింగ్ కమిటీలో చామల కిరణ్​ కుమార్ రెడ్డి మెంబర్ గా ఉన్నారు.

Next Story