‘చట్టం చదవండి - రైతులకు చెప్పండి’.. లా విద్యార్థులకు భూమి సునీల్ కీలక పిలుపు

by Gantepaka Srikanth |

ప్రతి న్యాయశాస్త్ర విద్యార్థి(Law Students) పదిమంది రైతులకు భూ భారతి చట్టాన్ని(Bhu Bharati Act) వివరిస్తే కనీసం రెండు లక్షల మంది అన్నదాతలకు చట్టం తెలుస్తుందని భూ చట్టాల నిపుణుడు, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్(Bhumi Sunil) అన్నారు.

‘చట్టం చదవండి - రైతులకు చెప్పండి’.. లా విద్యార్థులకు భూమి సునీల్ కీలక పిలుపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రతి న్యాయశాస్త్ర విద్యార్థి(Law Students) పదిమంది రైతులకు భూ భారతి చట్టాన్ని(Bhu Bharati Act) వివరిస్తే కనీసం రెండు లక్షల మంది అన్నదాతలకు చట్టం తెలుస్తుందని భూ చట్టాల నిపుణుడు, రైతు, వ్యవసాయ సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్(Bhumi Sunil) అన్నారు. భూ భారతి చట్టం తెలిస్తే రైతులు భూమి సమస్యల పరిస్కారానికి మార్గం దొరుకుతుంది. లా విద్యార్థులకు న్యాయ శాస్త్ర నైపుణ్యం పెరుగుతుందన్నారు. రాష్ట్రంలో ఉన్న పాతిక వేల మంది లా విద్యార్థులు భూభారతిని ప్రజలకు వివరించే యజ్ఞంలో పాల్గొని సామాజిక ఇంజినీర్లుగా మీ బాధ్యతను నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. రైతులకు భూ భారతి చట్టాన్ని వారి చుట్టంగా చేద్దామన్నారు. తెలంగాణాలోని ప్రతీ న్యాయశాస్త్ర విద్యార్థి ఒక గ్రామానికి వెళ్ళండి. పది మందికి చట్టం వివరించండి. ఒక ఫొటో దిగి సోషల్ మీడియాలో పెట్టండి. 9000222674 నెంబర్‌కు కూడా ఆ ఫోటో మరియు మీ వివరాలు పంపాలని కోరారు.

Next Story