- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాణ్యమైన విత్తనం రైతు హక్కు: చట్టాలతో నష్ట పరిహారం సాధ్యం
నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని, కానీ ప్రతి పంట కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని రైతు కమిషన్సభ్యులు భూమీ సునీల్పేర్కొన్నారు. విత్తన నాణ్యతలో లోపంతో కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తక, ఆశించిన దిగుబడి రాక ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: నాణ్యమైన విత్తనం రైతు హక్కు అని, కానీ ప్రతి పంట కాలంలో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోతున్నారని రైతు కమిషన్సభ్యులు భూమీ సునీల్పేర్కొన్నారు. విత్తన నాణ్యతలో లోపంతో కొనుగోలు చేసిన విత్తనం మొలకెత్తక, ఆశించిన దిగుబడి రాక ఏటా వేలమంది రైతులు నష్టపోతున్నారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. విత్తనాలకు సంబంధించి చట్టాలు ఉన్నాయని, నష్ట పరిహారం రైతులు పొందేందుకు పలు మార్గాలు ఉన్నాయని వివరించారు.
అమలులో ఉన్న విత్తన చట్టాలు
ప్రస్తుతం రాష్ట్రంలో అభివృద్ధి చేసిన విత్తనాలు, మొలకల చట్టం 1951 కాగా, విత్తనాల చట్టం 1966, కొత్త వంగడాల రక్షణ, రైతు హక్కుల చట్టం 2001, పత్తి విత్తనాల చట్టం 2007 ఉంది. నాణ్యతలేని విత్తనాలతో నష్టం జరిగితే నష్టపరిహారం పొందవచ్చు. వినియోగదారుల చట్టం కింద జిల్లా వినియోగదారుల ఫోరమ్‌లో కేసు వేయవచ్చు. దీంతో పాటు సివిల్ కోర్టులో కేసు దాఖలు చేసేందుకు వీలుంది. పత్తి విత్తనాల చట్టం కింద రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు. రిజిస్టర్ అయిన కొత్త వంగడాలలో నాణ్యతా లోపం అయితే రైతు హక్కుల చట్టం కింద కేంద్ర ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చు.
రసీదు భద్ర పర్చుకోవాలి
రైతులు నష్టపరిహారం పొందాలంటే ముందుగా విత్తనాలు కొన్నపుడు రసీదు తప్పక తీసుకోవాలి. విత్తనాలు ఉంచిన డబ్బా, సంచి దాచి ఉంచాలి. విత్తనాల గురించి సమాచారం తెలుపుతూ ఇచ్చిన కాగితాలను భద్రపర్చాలి. వీలైతే కొన్ని విత్తనాలను భద్రపరచాలి. పంట నష్టం జరిగిన వెంటనే వ్యవసాయ అధికారికి, సంబంధిత డీలర్, కంపెనీ ప్రతినిధికి తెలిపాలి. నష్ట పరిహారం కోసం వినియోదారుల ఫోరంలో కేసు వేయాలి.






