- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti: వ్యవసాయంతో పాటు ఇందిరమ్మ ఇండ్లకు రుణాలివ్వండి: భట్టి
స్టేట్ లెవల్ బ్యాంకర్ల సమావేశంలో భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు, స్వయం ఉపాధి పథకాలకు విరివిగా రుణాలు ఇవ్వాలని బ్యాంకర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కోరారు. రాష్ట్ర అభివృద్ధిలో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదని చెప్పారు. ఇవాళ ప్రజాభవన్ లో స్టేట్ లెవల్ బ్యాంకర్లతో (State Level Bankers meeting) సమావేశమైన భట్టి విక్రమార్క.. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ రైజింగ్ -2047 లో బ్యాంకర్ల పాత్ర కీలకమైనదన్నారు. 3.87 లక్షలతో తలసరి ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్ర భాగాన నిలిచిందని, వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్ గా ఉందని చెప్పారు.వ్యవసాయ రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. రైతులకోసం రుణమాఫీ, రైతుభరోసా, ఉచిత విద్యుత్ వంటి కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. వార్షిక రుణ ప్రణాళికలో మొదటి క్వార్టర్ లోనే 33.64 శాతం సాధించడం అభినందనీయం అన్నారు. ఆస్తుల తాకట్టు, ఫిక్స్ డ్ డిపాజిట్లు చేయాలని రైతులకు ఒత్తిడి చేయవద్దన్నారు. వ్వయసాయ రంగం ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక అని రైతుల పక్షాన రైతుమాఫీ, రైతు భరోసా పేరిట బ్యాంకులకు రుణాలు జమ చేశామన్నారు. రూ.30 వేల కోట్లు రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు జమ చేసిందన్నారు. బ్యాంకింగ్ రికవరీ చరిత్రలో ఇదో రికార్డు అని చెప్పారు.






