- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
త్రివేణి సంగమంలో భక్త జన సందోహం.. పుష్కర స్నానాలచరించిన భట్టి దంపతులు
కాలేశ్వరం త్రివేణి సంఘంలో భక్తజన సందేహం కోలాహలంగా సాగింది. శుక్రవారం సరస్వతి పుష్కరాల సందర్భంగా ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి.

దిశ, మల్హర్( కాలేశ్వరం): కాలేశ్వరం త్రివేణి సంఘంలో భక్తజన సందేహం కోలాహలంగా సాగింది. శుక్రవారం సరస్వతి పుష్కరాల సందర్భంగా ఘాట్లు భక్తులతో కిటకిటలాడాయి. ఉదయం నుండే భక్తులు పెద్ద సంఖ్యలో పుష్కర స్నానాలకు సరస్వతి ఘాట్ చేరుకొని పుణ్యస్నానాలు ఆచరించారు. పుష్కర స్నానానికి ఎంతో పవిత్రత కలిగిన ఈ సందర్భాన్ని భక్తులు ఆధ్యాత్మికంగా జరుపుకున్నారు. భక్తుల రాకతో ఘాట్ల వద్ద ఆధ్యాత్మిక చైతన్యం కనిపించింది. అధికారులు భక్తులకు మార్గనిర్దేశనం చేస్తూ, పుష్కర స్నానంతో పాటు భక్తులు నదీ తీరాల్లో హారతులు సమర్పిస్తూ, దానం చేస్తూ తమ ఆధ్యాత్మికతను చాటుకున్నారు. సాయంత్రం కాలేశ్వరం చేరుకున్న రాష్ట్ర ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సరస్వతి పుష్కరాల సందర్భంగా త్రివేణి సంగమంలో కుటుంబ సభ్యులతో పుష్కర స్నానం ఆచరించిన భట్టి విక్రమార్క మల్లు దంపతులు.ఈ సందర్భంగా నదీమతల్లికి సారె చీర సమర్పించారు. సరస్వతి విగ్రహం వద్ద అలకించిన అలంకరణను, కాలేశ్వరం లోని టెంపుల్ లకు అమర్చిన విద్యుత్తు లైట్లు వీర జిల్లుతున్న రంగురంగుల వెళ్తురును తిలకించారు. ఉపముఖ్యమంత్రి వెంట రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, గోదావరిఖని ఎమ్మెల్యే మక్కా సింగ్ ఠాగూర్, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావులు ఉన్నారు.
సరస్వతి పుష్కరాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లు పరిశీలించిన మంత్రి శ్రీధర్ బాబు
సరస్వతి పుష్కరాల నేపథ్యంలో పుష్కర ఘాట్ల వద్ద భక్తులకు అందుబాటులో ఉండే సదుపాయాలను, సేవలను సమీక్షించేందుకు మంత్రి శ్రీధర్ బాబు విస్తృతంగా పర్యటించారు. ఘాట్ల వద్ద ఏర్పాటు చేసిన స్టాళ్లు, భక్తులకు సరఫరా చేసే తాగునీరు, ఆరోగ్య సదుపాయాలు, భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. రోజు రోజుకు భక్తుల రద్దీ పెరుగుతుందని అధికారు లు అప్రమత్తంగా ఉండాలని తెలుపుతూ స్వచ్ఛత, ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగనివ్వద్దని కలెక్టర్ రాహుల్ శర్మ
రెండవ రోజు సరస్వతి పుష్కరాల ఏర్పాట్లను పరిశీలనకు కాలినడకన తిరుగుతూ భక్తుల సౌకర్యాల ఏర్పాట్ల పై కలెక్టర్ ఆరా తీస్తూ స్టాళ్లు, టెంట్ సిట, సరస్వతి ఘాట్ వద్ద భక్తులను పుష్కర ఏర్పాట్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు, షవర్స్, ఘాట్స్ పరిశీలించి త్రివేణి సంగమం వద్ద భక్తులకు మంచినీటి సరఫరాకు చలి వేంద్రం తక్షణమే ఏర్పాటు చేయాలని ఆర్ డబ్ల్యూ ఎస్ ఈ ఈ ని ఆదేశించారు. భక్తులతో మంచినీరు అందుతున్నదా? మరుగుదొడ్లు, స్నానాల షవర్స్ ఎలా ఉన్నాయంటూ భక్తులను అడిగి తెలుసుకున్నారు. త్రివేణి సంగమంలో భక్తులు స్నానాలకు వెళ్ళడానికి వెళ్ళు మార్గంలో పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని దాని వల్ల భక్తులు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్నారని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన మార్గంలో ఎలాంటి పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వహించొద్దని సూచించారు. పిండ ప్రదానం కార్యక్రమాలు నిర్వాహణకు కేటాయించిన ప్రాంతంలో మాత్రమే పిండ ప్రదానాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ కిరణ్ ఖరే తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






