నెహ్రూ దేశంలో ఆస్తులను సృష్టిస్తే.. ప్రధాని మోడీ అమ్మేస్తున్నారు: భట్టి ఫైర్

by Disha Web Desk 19 |
నెహ్రూ దేశంలో ఆస్తులను సృష్టిస్తే.. ప్రధాని మోడీ అమ్మేస్తున్నారు: భట్టి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. దేశంలోని పేదలపైనా ప్రధాని మోడీ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని అన్నారు. ఆదివారం అసెంబ్లీ సమావేశాలకు హజరైన భట్టి ఈ సందర్భంగా మాట్లాడారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ దేశంలో ఆస్తులను సృష్టిస్తే.. ప్రధాని మోడీ మాత్రం ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తున్నారన్నారు. ఆయనకు సంబంధించిన పెట్టుబడిదారులకు ఈ దేశాన్ని కట్టబెడుతున్నారని ఆరోపించారు. రైతులకు రుణమాఫీ చేయరు.. పేదలకు ఉచిత కరెంట్ మాత్రం ఇవ్వరు కానీ.. బహుళ జాతి సంస్థలకు రూ.11లక్షల కోట్లు రుణమాఫీ చేశారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కార్పొరేట్ల చేతిలో పెడుతున్నారని ధ్వజమెత్తారు. రైతులను దళారులు మోసం చేయకుండా చూడాలన్నారు. సీసీఐని కొనసాగించేలా ఒత్తిడి తీసుకువద్దామని పిలుపునిచ్చారు. సర్పంచ్ చేసే పనులకు త్వరగా బిల్లులు ఇవ్వండని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పేదలకు ఇళ్లు నిర్మించుకునేందుకు వెంటనే రూ.3 లక్షలు ఇవ్వాలన్నారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇవ్వాలని కోరారు.

Next Story