ఘోరం .. రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్

by srinivas |
ఘోరం .. రోడ్డు ప్రమాదంలో నలుగురు స్పాట్ డెడ్
X

దిశ, వెబ్ డెస్క్: అనంతపురం జిల్లా గుత్తిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మృతులు, క్షతగాత్రులు అనంతపురం పట్టణం రాణినగర్ వాసులు. హైదరాబాద్ - బెంగళూరు హైవే‌పై ఈ ప్రమాదం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా అంచనా వేశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పతికి తరలించారు. రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read More..

జగనన్న చెప్పినా నమ్మరే..?.. తగ్గిపోతున్న ఆ సంఖ్య

Next Story