బీఆర్ఎస్ లాగా చేసి ఉంటే బడ్జెట్ రూ.3,30 కోట్లు దాటేది.. చిట్‍చాట్‍లో భట్టి

by Prasad Jukanti |   (  Updated:2026-03-20 09:29:10  IST  )

తెలంగాణ బడ్జెట్ ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపమని, ఉద్యోగులకు రూ.కోటి బీమా కల్పిస్తూ వాస్తవ అంచనాలతో బడ్జెట్ రూపొందించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు.

బీఆర్ఎస్ లాగా చేసి ఉంటే  బడ్జెట్  రూ.3,30 కోట్లు దాటేది.. చిట్‍చాట్‍లో భట్టి
X

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: మాది పీపుల్స్ సెంట్రిక్ బడ్జెట్ అని ప్రజలే కేంద్రంగా బడ్జెట్ ప్రవేశపెట్టామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) అన్నారు. ఇవాళ సభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన అనంతరం మీడియాతో ఆయన చిట్ చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఎలాంటి వివక్ష లేకుండా బీమా సౌకర్యం కల్పించామని చెప్పారు. ఉద్యోగులు అందరికీ కోటి రూపాయల బీమా కల్పించామని చెప్పారు. వాస్తవిక బడ్జెట్ కాబట్టే ఇక్కడితో ఆగామని బీఆర్ఎస్ మాదిరిగా చేసి ఉంటే బడ్జెట్ మూడు లక్షల 30 వేల కోట్ల వరకు వెళ్లేదని సెటైర్ వేశారు. అలా కాకుంటా వాస్తవ అంచనాలతో రూ.3,24,234 కోట్లతో బడ్జెట్ రూపొందించినట్లు చెప్పారు.

ఆర్భాటాలకు పోలేదు:

కాగా ఇవాళ బడ్జెట్ స్పీచ్ తాము ఆర్భాటాలకు పోకుండా ఆర్థిక క్రమశిక్షణకు ప్రాధాన్యత ఇచ్చామని తద్వారా అభివృద్ధికి, సంక్షేమానికి పెద్ద పీట వేశామన్నారు. తాము ప్రవేశ పెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షల ప్రతిరూపం అని పీడిత, తాడిత, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ఇస్తున్న భరోసా అన్నారు. ఒక వైపు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు ఎన్ని ఎదురైనా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం నిధుల కొరత రాకుండా ఈ బడ్జెట్ ను సమతుల్యంగా రూపొందించామని చెప్పారు. పన్నుల భారంతో సామాన్యుడి పైన భారం మోపకుండా ఉన్న వనరులను సద్వినియోగం చేస్తూ కొత్త సంపద సృష్టించి దానిని ప్రజలకు పంచడమే మా ప్రజా ప్రభుత్వ ఆర్థిక విధానం అని చెప్పారు.

Next Story