- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లేడీ అఘోరీకి బిగ్ షాక్...ఆ పాడు పనులు చేస్తూ దొరికింది!
రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ ( Lady Aghori) ఈ మధ్యకాలంలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూ ధర్మం,

దిశ, వెబ్ డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో లేడీ అఘోరీ ( Lady Aghori) ఈ మధ్యకాలంలో రచ్చ చేస్తున్న సంగతి తెలిసిందే. హిందూ ధర్మం, దేవాలయాలను రక్షిస్తాను అంటూ.. ఎక్కడపడితే అక్కడ కనిపిస్తోంది ఈ లేడీ అఘోరీ. ముఖ్యంగా వేములవాడ రాజన్న (vemulawada) సన్నిధిలో ఉన్న.. దర్గాను తీసేస్తానని... అప్పట్లో ప్రకటనలు చేసి నానా హంగామా సృష్టించింది. అయితే.. అలాంటి లేడీ అఘోరీ ఇప్పుడు.. మరో వివాదంలో చిక్కుకుంది. లేడీ అఘోరీకి... ఓ యూట్యూబ్ ఛానల్ ఉందని.. అందులో బెట్టింగ్ యాప్స్... కూడా ప్రమోట్ చేసిందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఓ ప్రముఖ బెట్టింగ్ యాప్ ను ( Betting app case) ప్రమోట్ చేస్తున్న లేడీ అఘోరీ వీడియో బయటకు కూడా వచ్చింది.
దీంతో అఘోరీ ( Lady Aghori)పై ఎప్పుడైనా పోలీసులు కేసు నమోదు చేసే అవకాశాలు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో గనక ప్రపంచ యాత్రికుడు అన్వేష్ ( naa anveshana) కంటపడితే... లేడీ అఘోరీ పని అయిపోతుందని.. ఈ వీడియోని చూసిన నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒకవేళ ప్రపంచ యాత్రికుడు ఆ వీడియో చూస్తే... లేడీ అఘోరీ అరెస్ట్ కావడం గ్యారంటీ అని కూడా అంటున్నారు.
ఇది ఇలా ఉండగా.. బెట్టింగ్ యాప్ లు చేస్తున్న సెలబ్రిటీలపై వరుసగా.... పోలీస్ కేసులు నమోదు అవుతున్నాయి. మొదట వీరందరిపై.. ప్రపంచ యాత్రికుడు తన యూట్యూబ్ వేదికగా వీడియోలు పెట్టి హెచ్చరించాడు. బెట్టింగ్ యాప్ లు ప్రమోట్ చేయకండి అని సూచించాడు. అదే సమయంలో తెలంగాణ పోలీసులకు కూడా వాళ్ళ వివరాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో వరుస పెట్టి అందరిపై కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇక ఇప్పుడు లేడీ అఘోరీ పరిస్థితి కూడా అలాగే తయారవుతుందని అందరూ కామెంట్ చేస్తున్నారు.






