- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాసులే కాదయ్యా.. నమ్మకాన్ని దోచేశాడు..! స్నేహం ముసుగులో మోసం
స్నేహితుడికి డబ్బును అప్పజెప్పమని చెప్పితే.. ఆ సమాచారంతో డబ్బును కాజేసేందుకు స్కెచ్ వేసిన ఓ ఫ్రెండ్ కుట్ర ఇది. దర్యాప్తు చేసిన రాచకొండ పహాడి షరీఫ్ పోలీసులు గురువారం నలుగురిని అరెస్టు చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు.

దిశ, సిటీక్రైం : స్నేహితుడికి డబ్బును అప్పజెప్పమని చెప్పితే.. ఆ సమాచారంతో డబ్బును కాజేసేందుకు స్కెచ్ వేసిన ఓ ఫ్రెండ్ కుట్ర ఇది. దర్యాప్తు చేసిన రాచకొండ పహాడి షరీఫ్ పోలీసులు గురువారం నలుగురిని అరెస్టు చేశారు. మరోకరు పరారీలో ఉన్నారు. ఎల్బీనగర్ రాచకొండ పోలీసు కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపీ సుధీర్ బాబు వెల్లడించిన వివరాల ప్రకారం.. సంతోష్ నగర్ లో మహ్మాద్ జకీర్ తన అల్లుడు కబీర్ అతని స్నేహితుడు ఓబేద్ ద్వారా ఓ ప్లాట్ ను కొనుగొలు చేసేందుకు 29 లక్షలను సిద్ధం చేశాడు.
ఈ నగదును అల్లుడు కబీర్ కు తీసుకోవాలని చెప్పడంతో కబీర్ తాను హైదరాబాద్ లో లేనని ఆ డబ్బును తన స్నేహితుడు సయ్యద్ అబ్దుల్ ఖాదర్ కు ఇవ్వాలని చెప్పాడు. ఈ విషయాన్ని కబీర్ తన స్నేహితుడు అబ్దుల్ ఖాదర్ కు చెప్పి ఆ నగదును తన దగ్గర పెట్టుకోవాలని తాను హైదరాబాద్ కు వచ్చిన తర్వాత తీసుకుంటానని చెప్పాడు. ఈ విషయం తెలియగానే అబ్దుల్ ఖాదర్ తన స్నేహితులైన హాబీబ్ హారూన్, వర్ధన్, రసికాంత్ బర్దా, రషీద్ లతో కలిసి ఆ డబ్బును దోచుకోవాలని ప్లాన్ చేశాడు.
జకీర్ 29 లక్షల రూపాయాలను ఇద్దరితో పంపిస్తున్నానని అబ్దుల్ ఖాదర్ కు చెప్పాడు. డబ్బును తీసుకుని బయలుదేరిన ఇద్దరు అబ్దుల్ ఖాదర్ కు ఫోన్ చేశారు. దీంతో ముందగానే ప్లాన్ ప్రకారం అబ్దుల్ ఖాదర్ ఎర్రకుంట దగ్గర టోటల్ గ్యాస్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రాంతంకు చెందిన లొకేషన్ ను పెట్టాడు. అక్కడికి డబ్బుతో వచ్చిన వారిని మాటు వేసి గమనించిన అబ్దుల్ ఖాదర్ స్నేహితులు వర్ధన్, రసికాంత్, బర్దాలు బైక్ పై వచ్చి డబ్బుతో ఉన్న వారి పై దాడికి పాల్పడి 29 లక్షలను ఎత్తుకెళ్ళిపోయారు. ఆ తర్వాత డబ్బును అబ్దుల్ ఖాదర్ కు ఇచ్చారు. డబ్బు దోచుకుని వచ్చిన వారికి ఒక్కోకరికి 20 వేలు ఇచ్చి మిగతా నగదును రెండు రోజుల తర్వాత పంచుకుందామని చెప్పి అబ్దుల్ ఖాదర్ డబ్బులను తన ఇంట్లో డబ్బును దాచిపెట్టాడు. ఈ దోపీడీ పై దర్యాప్తు చేసిన పోలీసులు అబ్దుల్ ఖాదర్ తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. మరొక నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.






